Chandrayaan-3: ఇస్రోకి బాగా కలిసొచ్చిన సంవత్సరం.! ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్న ఇస్రో.
అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వం 1969లో ఇస్రో ను ఏర్పాటు చేసింది. మొదట్లో తలపెట్టిన ప్రయోగాల్లో విజయాల కంటే అపజయాలే ఎక్కువ. భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి అప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమయిన, కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది.
అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వం 1969లో ఇస్రో ను ఏర్పాటు చేసింది. మొదట్లో తలపెట్టిన ప్రయోగాల్లో విజయాల కంటే అపజయాలే ఎక్కువ. భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి అప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమయిన, కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది. చంద్రుడి దక్షిణ ఉపరితలంపై ల్యాండింగ్ అనేది ఇప్పటివరకు ఎవరికి సాధ్యపడలేదు. అలాంటి చోట ఇస్రో గ్రాండ్ సక్సెస్ కొట్టింది. అయితే ఇదంతా ఒక్క సారిగా సాధ్యపడలేదు. అంచలంచెలుగా ఒక్కో లోపాన్ని అధిగమించి విజయాల వైపు దూసుకెళుతోంది. అందులో 2023 ఇస్రోకి బాగా కలిసొచ్చిన ఏడాదిగా చెప్పాలి. ఇస్రో ఇటీవల ప్రయోగాల సంఖ్య బాగా పెంచింది. ఇస్రో ఆవిర్భవించిన తొలి నాళ్ళలో ఏడాదికి ఒకటి లేదా రెండు ప్రయోగాలు మాత్రమే జరిగేవి. ప్రయోగాల సంఖ్య కంటే.. విజయాలే ముఖ్యమనే భావనలో ఆచి తూచి ప్రయోగాలు చేపట్టేది ఇస్రో. గత ఐదేళ్లుగా ఏడాదికి 12 ప్రయోగాలు తక్కువ కాకుండా ఉండేలా క్యాలెండర్ ను సిద్ధం చేసుకుని లక్ష్యం దిశగా వెళుతోంది. అయితే కోవిడ్ కారణంగా రెండేళ్లు ఇస్రో లక్ష్యాలను పూర్తిగా ఇబ్బందిపెట్టింది. 2020, 2021 లో ప్రయోగాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2020 లో కేవలం రెండు ప్రయోగాలు మాత్రమే జరిగాయి. ఇక 2021లో కూడా టార్గెట్ ఎక్కువగానే ఉన్నా అతి కష్టం మీద రెండు ప్రయోగాలను చేపట్టగలిగింది ఇస్రో. ఇక 2022 లో ఐదు ప్రయోగాలు చేపట్టి విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది.
2023 లో ప్రయోగాల సంఖ్యతో పాటు రికార్డులు సైతం తన ఖాతాలో వేసుకుంది ఇస్రో. చంద్రాయాన్ 1 తో చంద్రుడిపై నీటి జాడని కనుగొన్న ఇస్రో చంద్రయాన్ 2 పాక్షిక విజయంతో అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. ఆ కొరతను 2023 తీర్చింది. చంద్రుడి ఉపరితలంపై అదికూడా దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ విజయవంతం చేయడంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఆసక్తిగా చూసేలా చేసింది ఇస్రో. ఇప్పటి వరకు రష్యా, జపాన్, అమెరికా లాంటి దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టినా దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేయలేక పోయాయి. అలాంటి చోట ల్యాండింగ్ కావడం అక్కడి విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పడంలో ఇస్రో సక్సెస్ కొట్టింది. ఇక చిన్న ఉపగ్రహాలను నింగిలోకి తక్కువ ఖర్చుతో పంపేందుకు ఇస్రో సరికొత్త వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) రూపొందించింది. 2022 లోనే దీన్ని ప్రయోగించిన అనుకున్నంతగా సక్సెస్ రాలేదు. 2023 ఫిబ్రవరిలో లోపాలను సవరించి విజయవంతం చేసింది. ఇక చంద్రయాన్ 3 జరిగిన నెలల వ్యవధిలోనే సూర్యుడిపై ప్రయోగం కోసం ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టింది. ప్రస్తుతం నిర్దేశిత గమ్యం దిశగా ఆదిత్య ప్రయాణం కొనసాగుతోంది. ఇలా 2023 లో మొత్తం 8 ప్రయోగాలను చేపట్టింది ఇస్రో. ఆరు దశాబ్దాల ఇస్రో ప్రయాణంలో 2023 కీలకమనే చెప్పాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.