Chandra Grahan 2022 Live: కార్తీక పున్నమి గ్రహణం శుభమా.? అశుభమా.? ఆ సమయంలో ఇవి చెయ్యకండి..(లైవ్)
ఇవాళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం, సంపూర్ణమైన చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడుతోంది. ఈ ఏడాది చివరగా సంపూర్ణ చంద్రగ్రహణం
ఇవాళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం, సంపూర్ణమైన చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడుతోంది. ఈ ఏడాది చివరగా సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.30 కొనసాగనుంది. సూర్యగ్రహణం ఏర్పడిన పదిహేను రోజుల గ్యాప్‌లోనే చంద్రగ్రహణం ఏర్పడడం గమనార్హం. ఈ ఏడాది ఏర్పడిన మొత్తం నాలుగు గ్రహణాలు.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే కనిపించడం విశేషం. ఇవాళ్టి సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌తోపాటు పలుదేశాల్లో కనిపించనుంది. ఈ చంద్రగ్రహణం పాక్షికమైనదే అయినా.. దీని ప్రభావం మనపై ఉంటుంది అంటున్నారు. ఈ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్, హిందుమహా సముద్ర ప్రాంతాల్లో కనిపించనుండగా.. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనుందని ఖగోళ పరిశోధకులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..