రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే

Updated on: Jan 11, 2026 | 1:11 PM

సాధారణ చేతి రుమాలు ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువైన చంబా రుమాలు, హిమాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం. 'దోరుఖా' అనే ప్రత్యేక పట్టు దారపు కుట్టుపనితో, మస్లిన్ వస్త్రంపై పురాణ గాథలను జీవం ఉట్టిపడేలా కుట్టడం దీని ప్రత్యేకత. జీఐ ట్యాగ్ పొందిన ఈ కళ, నెలల కృషి ఫలితంగా రూ. 40 లక్షల వరకు ధర పలుకుతుంది.

సాధారణంగా ఒక చేతి రుమాలు ధర ఎంత ఉంటుంది? పది రూపాయలు.. మహా అయితే వంద రూపాయలు. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగిన ‘హిమ్‌ ఎంఎస్‌ఎంఈ ఫెస్ట్‌’ లో ప్రదర్శించిన ఒక రుమాలు ధర విని సందర్శకులు ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే అది కేవలం ఒక వస్త్రం కాదు, కొన్ని శతాబ్దాల ‘చంబా రాజ్య’ సాంస్కృతిక వారసత్వం. అయితే ఆ ప్రత్యేక రూమాలు ముచ్చట్లేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రుమాలు తయారీకి అత్యంత సున్నితమైన, పలుచని కాటన్ క్లాత్‌ను ఉపయోగిస్తారు. దీనినే ‘మస్లిన్’అంటారు.దీనిని పట్టు దారంతో ‘దోరుఖా’ అనే పద్ధతిలో కుడతారు. అంటే, రుమాలుకు అటువైపు, ఇటువైపు డిజైన్ ఒకేలా కనిపిస్తుంది. ఎక్కడా ముడి అనేది కనిపించకపోవడం దీని ప్రత్యేకత. రుమాలుపై ఉండే చిత్రాలు పురాణ గాథలను, ముఖ్యంగా కృష్ణ లీలలను దారంతో నమ్మలేనంత సహజంగా కుడతారు. అందుకే దీనిని ‘నీడిల్ పెయింటింగ్’ అని కూడా పిలుస్తారు.17వ శతాబ్దంలో చంబా రాజ్య పాలకులు ఈ కళను ప్రోత్సహించారు. పండుగలు, శుభకార్యాల్లో ఈ రుమాలును బహుమతిగా ఇచ్చేవారు. ఒక్క రుమాలును రెడీ చేయటానికి కళాకారులు నెలల పాటు శ్రమిస్తారు. అందుకే దీని ధర వేలల్లో ఉంటుంది. 2007లోనే దీనికి జీఐ ట్యాగ్‌ లభించింది. చంబా కళాకారిణి అంజలి వకీల్‌ తయారు చేసిన ఈ చంబా రుమాలు ధర చర్చనీయాంశంగా మారింది. చంబా రుమాలు ఎంబ్రాయిడరీ వర్క్‌లో ప్రావీణ్యానికిగానూ తన అత్తగారు లలితా వకీల్‌కు పద్మశ్రీ అవార్డు వచ్చిందని తెలిపారు. ఎంబ్రాయిడరీ వర్క్, డిజైన్, పరిమాణం, సంక్లిష్టతను బట్టి చంబా రుమాలు ధర రూ.1,500 నుంచి రూ.40 లక్షల దాకా ఉంటుందని వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్‌

ఇవి పిచ్చి ఆకులు కాదండి బాబు.. విషయం తెలిస్తే షాకవుతారు

బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం

ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

ప్రపంచంలోనే తొలి క్లోన్‌ వరి వంగడం