Viral: దొంగలు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. గుంటూరులో ఇస్మార్ట్‌గా సెల్‌ఫోన్‌ దొంగలు.!

|

Nov 28, 2023 | 5:15 PM

దొంగలు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. స్మార్ట్‌ యుగంలో ఇస్మార్ట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు. గుంటూరులో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు, ఒంటరిగా ఎవరైనా దొరికితే చాలు వారి ప్లాన్‌ అమలు చేసి తెలివిగా సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారు. ఇటీవల స్మార్ట్‌ ఫోన్లు అత్యాధునిక ఫీచర్లతో మరింత స్మార్ట్‌గా అందుబాటులోకి వచ్చాయి. వాటి ధరకూడా బాగానే పలుకుతుండటంతో దొంగలు సెల్‌ఫోన్లపై కన్నేశారు.

దొంగలు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. స్మార్ట్‌ యుగంలో ఇస్మార్ట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు. గుంటూరులో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు, ఒంటరిగా ఎవరైనా దొరికితే చాలు వారి ప్లాన్‌ అమలు చేసి తెలివిగా సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారు. ఇటీవల స్మార్ట్‌ ఫోన్లు అత్యాధునిక ఫీచర్లతో మరింత స్మార్ట్‌గా అందుబాటులోకి వచ్చాయి. వాటి ధరకూడా బాగానే పలుకుతుండటంతో దొంగలు సెల్‌ఫోన్లపై కన్నేశారు. గుంటూరు నగరంలోని వసంత రాయ పురానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 26 వ తేదిన అమరావతి రోడ్డులో ఉండగా ఓ యువకుడు బైక్ పడిపోతున్నట్లు నటించి సాయం చేయాలని అడిగాడు. దీంతో ప్రసాద్ ఆ యువకుడికి సాయం చేయడానికి వెళ్లాడు. అదే సమయంలో మరొక యువకుడు అక్కడికి వచ్చి బైక్ పై నుండి పడిపోతున్న యువకుడికి సాయం అందించాడు. ఆ తర్వాత ప్రసాద్ తన షాపులోకి వెళ్లాడు. యువకులిద్దరూ బైక్ పై వెళ్లిపోయారు. షాపులోకి వెళ్లిన తర్వాత ప్రసాద్ తన జేబులో సెల్ ఫోన్ పోయినట్లు గుర్తించి, అది ఆ యువకుల పనేనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడే ఉన్న సిసి కెమెరా విజువల్స్ కూడా తీసుకున్నాడు. ఇదంతా సిసి కెమెరా విజువల్స్ లో స్పష్టంగా రికార్డైంది. ఇది జరిగిన 2 నెలలు తర్వాత మళ్లీ అదే పరిస్తితి ఎదురైంది ప్రసాద్‌కి. ప్రసాద్ వసంతరాయపురంలోని తన ఇంటి వద్ద బైక్ ఆపే సమయంలో సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. అయితే ఒకసారి దెబ్బతిని ఉన్న ప్రసాద్‌ అలర్టయి వారికి సాయం చేసేందుకు వెళ్లలేదు. ప్లాన్‌ బెడిసికొట్టిందని గ్రహించిన యువకులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. తరచూ ఈ ఘటనలు రిపీట్‌ అవుతుండటంతో మరోసారి పోలీసులను ఆశ్రయించాడు ప్రసాద్‌. సిసి కెమెరా విజువల్స్ పరిశీలించగా ఇద్దరు యువకులూ అక్కడ వరకూ కలిసే వచ్చినట్టు గ్రహించిన పోలీసులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.