Watch: ఏడుగురిని బలిగొన్న స్కార్పియో కారు.. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. వేగంగా దూసుకొచ్చిన మహీంద్ర స్కార్పియో కారు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆటో, ట్రాక్టర్, రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా..
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. వేగంగా దూసుకొచ్చిన మహీంద్ర స్కార్పియో కారు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆటో, ట్రాక్టర్, రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో నలుగురు ఆస్పత్రిలో మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. అయితే స్కార్పియో కారులో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సమీపంలో ఓ దుకాణంలో ఏర్పాటు చేసిని సీసీటీవీ కెమరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.