కాలు మోపితే కాటికే.. భయంకరమైన మృత్యు గుహ !!

|

Dec 27, 2024 | 12:48 PM

అదో గుహ... లోపలికి వెళ్లేందుకు చిన్న ద్వారం ఉంటుంది.. చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది... కానీ అందులో అడుగుపెట్టారో... క్షణాల్లో ప్రాణాలు కోల్పోతారు! చిన్నా పెద్దా ప్రాణులేవైనా సరే ఆ గుహలోకి వెళితే అంతే సంగతులు! ఇంతకీ ఆ గుహ ఎక్కడుందో తెలుసా? దక్షిణ అమెరికా ఖండంలోని కోస్టారికాలో ‘పోవాస్ అగ్నిపర్వతం పక్కన అడవుల మధ్యలో ఉంది.

అది ఎంత డేంజర్ అంటే… దానిపేరే ‘కేవ్ ఆఫ్ డెత్’ అంటే మృత్యు గుహ. గతంలో ఓ వ్యక్తి ఈ గుహ ద్వారానికి సమీపంలోకి వెళ్లాడట. ఒకట్రెండు నిమిషాల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడట. దీంతో ఈ గుహ గురించి వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఆ గుహ లోపలికి వెళ్లిన చిన్న చిన్న జీవులు అప్పటికప్పుడే చనిపోతున్నట్టుగా గుర్తించారు. దీని గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోస్టారికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వెళ్లి పరిశోధన చేశారు. అది చిన్నపాటి గుహే అయినా… దాని నుంచి అత్యంత తీవ్ర స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ వెలువడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సమీపంలోని అగ్నిపర్వతం కారణంగా భూమి పొరల్లోని పగుళ్ల ద్వారా ఈ గుహలోకి కార్బన్ డయాక్సైడ్ లీకవుతున్నట్టు తేల్చారు. అది ఎంత అంటే ప్రతి గంటకు ఏకంగా 30 కిలోల కార్బన్ డయాక్సైడ్ వస్తున్నట్టు గుర్తించారు. కార్బన్ డయాక్సైడ్ సాధారణ గాలికన్నా బరువుగా ఉంటుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పాలు ఒక్క గ్లాసు తాగితే చాలు !! మీ ఆరోగ్యానికి తిరుగులేదు !!

ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి డింగా డింగా

పెళ్లి స్టైల్ మారుతోంది.. వెల్ కం చెప్పాలా ?? రిజెక్ట్ చేయాలా ??

శ్రీతేజ్‌ కుటుంబానికి జానీ మాస్టర్ భరోసా