Cat Viral Video: పిల్లే కదా.. అని తీసిపాడేయకండి… వైరల్ అవుతున్న క్యూట్ వీడియో చూస్తే మీరే షాకవుతారు..
చిన్నపిల్లల చేష్టలు చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉంటాయి. వచ్చీ రాని అడుగులతో వారు చేసే చిలిపి చేష్టలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇది మనుషుల్లోనే కాదు.. జంతువులకు చెందిన పసికూనలు చేసే చేష్టలు కూడా క్యూట్‌గా వుంటాయి. కుక్కపిల్లలు, పిల్లి పిల్లలు చేసే చేష్టలు నవ్వు తెప్పిస్తాయి.
చిన్నపిల్లల చేష్టలు చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉంటాయి. వచ్చీ రాని అడుగులతో వారు చేసే చిలిపి చేష్టలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇది మనుషుల్లోనే కాదు.. జంతువులకు చెందిన పసికూనలు చేసే చేష్టలు కూడా క్యూట్‌గా వుంటాయి. కుక్కపిల్లలు, పిల్లి పిల్లలు చేసే చేష్టలు నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఓ పిల్లి పిల్లకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు.ఈ వైరల్ వీడియోలో ఒక పిల్లి ఒక ఇంట్లోంచి బటకు వస్తుంది. అది మెట్ల మీదనుంచి రాకుండా రెయిలింగ్ మీదనుంచి దిగడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో రెయిలింగ్ ఎక్కగానే జారిపోతుంది…అయినా వెనక్కి తగ్గని ఆ పిల్లి పిల్ల తన చిట్టి చేతులతో హ్యాండ్‌రైల్‌ను గట్టిగా పట్టుకొని కిందకు జారుతుంది. ఒకసారి దాని బ్యాలెన్స్ తప్పి పడిపోబోయింది అయినా వదల్లేదు.. ఈ క్రమంలో కూడా చాలా నెమ్మదిగా రెయిలింగ్ నుంచి జారి.. కిందకు దిగి పోతుంది. ఈ ఫన్నీ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కేవలం 16 సెకన్ల ఈ వీడియోను లక్షలమంది వీక్షించారు. వేలమంది లైక్‌చేస్తూ.. తమదైనశైలిలో కామెంట్లు చేస్తూ షేర్ చేస్తున్నారు.