Viral: రెండు తలల పిల్లిని మీరెప్పుడైనా చూశారా ??
ఇది ఓ పిల్లి కూన. ఏదో మామూలు కూన అనుకునేరు కాదండోయ్ ఏకంగా రెండు తలలతో పుట్టిన కూన! ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటల కంటే బతకవు.
ఇది ఓ పిల్లి కూన. ఏదో మామూలు కూన అనుకునేరు కాదండోయ్ ఏకంగా రెండు తలలతో పుట్టిన కూన! ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటల కంటే బతకవు. కానీ తాజాగా థాయ్‌లాండ్‌లో పుట్టిన ఈ కూన మాత్రం బతికేసింది. పైగా రెండు మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ యజమాని మురిసిపోతున్నాడు. దీనికి టుంగ్ గ్రెన్ అంటే వెండి బ్యాగ్, టుంగ్ టోంగ్ అంటే బంగారు బ్యాగ్ అని ఏకంగా రెండు పేర్లు కూడా పెట్టుకున్నాడు. ఒక్కో తలకు ఒక్కో పేరన్నమాట! దీని తల్లి ముందుగా ఒక మామూలు కూనను కనింది. తర్వాత రెండో కాన్పు కష్టంగా మారడంతో హుటాహుటిన స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారట. వాళ్లు సిజేరియన్ చేసి ఈ అరుదైన రెండు తలల కూనను విజయవంతంగా బయటికి తీశారు. దాంతో యజమాని ఆనందంలో మునిగిపోయాడు. ‘‘చనిపోతుందేమోనని ముందుగా భయపడ్డా. అలాంటిదేమీ జరక్కపోవడంతో నా ఆనందం రెట్టింపైంది’’ అని చెప్పుకొచ్చాడు. రెండు తలల పిల్లుల్ని రెండు తలల రోమన్ దేవత జానస్ పేరిట జానస్ క్యాట్స్ అని పిలుస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రాండ్‌గా జరుగుతున్న పెళ్లిలోకి వరద !! చివరికి ఏమైందంటే ??
Viral: గొర్రె ముందు యువతీ ఓవర్‌యాక్షన్.. గొర్రె ఏం చేసిందో తెలుసా ??
పరాయి యువతితో భర్త న్యూడ్ వీడియో కాల్స్ !! భార్య ఏం చేసిందో తెలుసా ??
తొపుడు బండి వ్యాపారికి బాడీగార్డ్స్ !! కారణం తెలిస్తే షాక్ అవుతారు ??
ఆవుదూడనే హడలెత్తించిన పిల్లి.. ఏం చేసిందో చూడండి..