Car Accident:వీడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి.. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు.. కళ్ళు చెదిరే వీడియో..
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిలో కొంతమంది తీవ్రంగా గాయపడతారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిలో కొంతమంది తీవ్రంగా గాయపడతారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రోడ్డుపై వాహనదారులేకాదు, పాదచారులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ భయానక ప్రమాదం నుంచి ఓ డ్రైవర్ వెంట్రుకవాసిలో తప్పించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈ వీడియోలో రెండు వాహనాలు ఒకదానికొకటి భయంకరంగా ఢీకొన్నాయి. రెండు వాహనాలు బాగా డామేజ్ అయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఓ వాహన డ్రైవర్ హఠాత్తుగా రోడ్డుమీద పడిపోయాడు. అయినా అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. పైగా ప్రమాదం జరిగిన వెంటనే లేచి చుట్టుపక్కల చూస్తూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. అయితే మరో వాహనంలో ఉన్నవారు కూడా స్వల్పగాయాలతో బయటపడి ఉంటారని తెలుస్తోంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి ‘హిట్ అండ్ రన్’ అని క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 13 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతటి భయానక యాక్సిడెంట్ నుంచి బయటపడ్డ ఆ డ్రైవర్‌కు ఇంకా భూమ్మీద నూకలున్నాయంటూ ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

