చావా సినిమా ఎఫెక్ట్‌ బంగారం కోసం ఆ కోట చుట్టూ తవ్వకాలు

Updated on: Mar 14, 2025 | 5:26 PM

సినిమాల ప్రభావం ఏ రీతిలో ఉంటుందో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. ఇటీవల రిలీజ్‌ అయిన చావా సినిమాలో మొఘల్ కాలం నాటి కోట ప్రాంతంలో బంగారు గని ఉన్నట్లు చూపించారు. ఈ క్రమంలో బంగారం కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు జోరందుకున్నాయి. అర్ధ రాత్రి వేళ గుంపులుగా వస్తున్న జనం టార్చిలైట్‌ వెలుతురులో తవ్వకాలు జరుపుతున్నారు.

బంగారం, వెండి నాణేలు దొరికినట్లు ప్రచారం జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌పై తీసిన చావా మూవీలో మొఘలుల కాలం నాటి అసిర్‌గఢ్ కోట ప్రాంతంలో బంగారు గని ఉన్నట్లు చూపించారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారి నిర్మాణం కోసం ఆ ప్రాంతంలోని ఒక దర్గా సమీపంలో జేసీబీతో మట్టిని తవ్వారు. దాన్ని స్థానిక రైతు పొలంలో పోశారు. అయితే ఆ మట్టిలో పురాతన కాలం నాటి నాణేలు లభించినట్లు పుకార్లు చెలరేగాయి. దీనికి తోడు చావా చిత్రంలో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించడంతో అక్కడ నాణేల కోసం తవ్వకాలు జోరందుకున్నాయి. సమీప గ్రామాలకు చెందిన ప్రజలు రాత్రివేళ అక్కడికి చేరుకుని టార్చిలైట్‌ వెలుతురులో తవ్వకాలు జరుపుతున్నారు. మొఘల్ కాలం నాటి బంగారం, వెండి నాణేలు తమకు దొరికినట్లు కొందరు చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెల్లారితే పెళ్లి..! అంతలోనే.. పెళ్లి కుమారుడి ఆత్మహత్య

హీరోయిన్ అంజలితో ఎఫైర్..? ఎమోషనల్ అయిన కోన

Dragon: రావణ రాజ్యంలో.. రాక్షసుడి వేట..