ఈ దున్న ఖరీదు రూ.11 కోట్లు !! అంత రేటు ఎందుకంటే ??

|

Nov 21, 2023 | 9:05 PM

సుమారు 150 దూడల జన్మకు కారణమైన అరుదైన, శ్రేష్ఠమైన దున్నను దాని యజమాని ఏకంగా రూ.11 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. 1,570 కిలోల బరువున్న దున్న అన్మోల్, రాజస్థాన్‌ అజ్మీర్‌లోని అంతర్జాతీయ పశు మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హర్యానాలోని సిర్సాకు చెందిన హర్విందర్ సింగ్‌ ఈ దున్నను సొంత కొడుకులాగ పెంచాడు. ఎనిమిదేళ్ల వయస్సు, 5.8 అడుగుల పొడవున్న ఈ దున్నకు అన్మోల్‌ అని పేరు పెట్టాడు.

సుమారు 150 దూడల జన్మకు కారణమైన అరుదైన, శ్రేష్ఠమైన దున్నను దాని యజమాని ఏకంగా రూ.11 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. 1,570 కిలోల బరువున్న దున్న అన్మోల్, రాజస్థాన్‌ అజ్మీర్‌లోని అంతర్జాతీయ పశు మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హర్యానాలోని సిర్సాకు చెందిన హర్విందర్ సింగ్‌ ఈ దున్నను సొంత కొడుకులాగ పెంచాడు. ఎనిమిదేళ్ల వయస్సు, 5.8 అడుగుల పొడవున్న ఈ దున్నకు అన్మోల్‌ అని పేరు పెట్టాడు. దీనికి ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఎంతో పాపులారిటీ లభించింది. యజమాని హర్విందర్ సింగ్‌, ఈ దున్నకు ప్రతి రోజు అరటి పండ్లు, గుడ్లు వంటి బలమైన ఆహారం తినిపిస్తాడు. గత ఏడాది 1400 కిలోల బరువున్న ఈ దున్న ప్రస్తుతం 1,570 కిలోల బరువుకు చేరింది. దీని వీర్యం వల్ల ఇప్పటి వరకు 40-50 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన 150 దూడలు జన్మించాయని యజమాని తెలిపాడు. దీని ఆహారం కోసం ప్రతి నెలా సుమారు మూడు లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏమి ఇకమత్‌రా బాబోయ్‌.. చిన్న టెట్రా ప్యాక్ తెరిచి చూస్తే.. కళ్లు జిగేల్‌

ఇజ్రాయెల్‌ నౌకను ఇలా హైజాక్‌ చేశారు !! తాజాగా విడుదల చేసిన హూతీ రెబెల్స్‌

రన్‌వే నుంచి సముద్రంలోకి విమానం !! చూసి షాక్‌ తిన్న స్థానికులు

కార్తీక మాసంలో ఏ దీపంతో ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది ??

TOP 9 ET News: పుష్ప2 బిగ్ హింట్‌ | అప్పుడే 13కోట్లు.. దూసుకుపోతున్న మంగళవారం