Bangladesh Hindus: నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు.! అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌

|

Aug 12, 2024 | 5:13 PM

బంగ్లాదేశ్‌లో నూతనప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో ఉంటున్న పలు హిందూ కుటుంబాలకు చెందినవారు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో ఉంటున్న వెయ్యిమంది హిందూ కుటుంబాలకు చెందినవారు

బంగ్లాదేశ్‌లో నూతనప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో ఉంటున్న పలు హిందూ కుటుంబాలకు చెందినవారు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో ఉంటున్న వెయ్యిమంది హిందూ కుటుంబాలకు చెందినవారు బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లోని రిజర్వాయర్‌లో నిలబడి తమను భారతదేశంలోకి అనుమతించాలని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ను అభ్యర్థిస్తున్నారు. వారిలోని కొందరు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. సరిహద్దులోని జీరో పాయింట్‌కు 150 గజాల దూరంలో ఉన్న కంచెను దాటకుండా బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. బారత్‌ – బంగ్లదేశ్‌ సరిహద్దుపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళం తూర్పు కమాండ్ ఏడీజీని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు. దీనికిముందు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం నిఘాను మరింతగా పెంచింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.