ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..

Updated on: Dec 06, 2025 | 2:26 PM

అనంతపురం జిల్లా కండ్లగూడూరులో నిద్రిస్తున్న చిన్నారులను పాము కాటు వేసింది. శివ నారాయణ అనే బాలుడు మృతి చెందగా, అన్న శివరామరాజు పరిస్థితి విషమంగా ఉంది. పాము కాటును గుర్తించడంలో ఆలస్యం కావడంతో ఒక బిడ్డను కోల్పోయి, మరో బిడ్డ ప్రాణాల కోసం తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

అన్నదమ్ములిద్దరూ స్కూలు నుంచి ఇంటికి రాగానే హోంవర్క్‌ చేశారు.. ఆటలాడుకున్నారు. ఉదయాన్నే స్కూలుకి వెళ్లాలని తొందరగా నిద్రపోయారు. ఉదయం పిల్లలను లేపబోయిన తల్లికి ఊహించని దృశ్యం కనిపించింది. ఆ చిన్నారులు ఇద్దరిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, దారిలోనే బాలుడు మృతి చెందాడు. ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కండ్ల గూడూరు గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులను పాము కాటేయడంతో… తమ్ముడు శివ నారాయణ మృతి చెందగా…అన్న శివరామరాజు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కండ్లగూడురు గ్రామానికి చెందిన వీర నారాయణ స్వామి, లక్ష్మీ దంపతుల కుమారులైన శివరామరాజు, శివ నారాయణ ఇంట్లో నిద్రిస్తుండగా… పాము కాటేసింది. దీంతో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న శివ నారాయణను తల్లిదండ్రులు పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. అయితే తమ్ముడు శివ నారాయణను పాము కాటేసినప్పుడే… అన్న శివరామరాజును కూడా పాము కాటేసిన విషయం తల్లిదండ్రులకు తెలియదు. దీంతో చిన్న కుమారుడు మార్గ మధ్యలోనే చనిపోవడంతో వెనక్కి తిరిగి వచ్చి ఇంట్లో చూడగా… ఇటు పెద్ద కొడుకు శివరామరాజు కూడా స్పృహ కోల్పోయి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆ బాలుడిని కూడా తల్లిదండ్రులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిద్రలోనే చిన్నారులను పాము కాటు వేసిన సంగతి తెలియక తల్లిదండ్రులు ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఓ చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రులు మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులో కొత్త మార్పులు..

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు

Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??

అవతార్ 3 థియేటర్లలో మహేష్‌ !! హాలీవుడ్‌లో మార్కెట్‌ పై జక్కన్న మాస్టర్ ప్లాన్

iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే