కూతురి పెళ్లిని పీటల మీదే ఆపేసిన తల్లి.. విషయం తెలిసి అంతా షాక్
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అత్తవారింటిలో అంతే అనందంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆచితూచి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు. అలా ఆలోచించే ఓ తల్లి తన కూతురి వివాహాన్ని పెళ్లి పీటల మీదే అర్థాంతరంగా ఆపేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.
అయితే ఆ తల్లి అంతటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలిసి ఆమెను అభినందించారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. కొద్ది పేపట్లో పెళ్లికూతురు మెడలో వరుడు తాళి కడతాడనగా పెళ్లి ఆపేయండి అంటూ తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం..ప్లీజ్ వెళ్లిపోండని వరుడిని, అతని కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇదేంటి కరెక్ట్‌గా ఈ టైంలో ఇలా అంటుందని అంతా విస్తుపోయారు. ఎందుకంటే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కూడా వరుడు ఫుల్‌గా తాగి స్నేహితులతో కలిసి గొడవ చేశాడు. అక్కడున్న వారిని ఇబ్బందికి గురి చేశారు వరుడు, అతడి స్నేహితులు. దీంతో వధువు తల్లి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే అతడి ప్రవర్తన ఇలా ఉంది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనే భయంతో ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: