Bride in Metro: కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి నవ వధువు..! వీడియో చూసిన వాళ్ళు కామెంట్ల వర్షం..
ఒంటినిండా నగలు, మేకప్‌తో పెళ్లికుతూరు తన వాళ్లతో కలిసి మెట్రోలో ప్రయాణించడం చూపరులను ఆకర్షించింది. ఈమె మెట్రోలో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కర్ణాటకకు కొత్త పెళ్లికూతురు వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తన కారును రోడ్డుపైనే వదిలిపెట్టి.. మెట్రో రైలులో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది. సరిగ్గా మూహూర్తం టైంకు అక్కడకు వెళ్లింది. ఎంచక్కా అనుకున్న సమయానికి మనువాడింది. ఒంటినిండా నగలు, మేకప్‌తో పెళ్లికుతూరు తన వాళ్లతో కలిసి మెట్రోలో ప్రయాణించడం చూపరులను ఆకర్షించింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. బెంగళూరులో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం సహజమే. ఈ పెళ్లికుతూరు కారు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఎంతసేపైనా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఓ వైపు ముహూర్తం టైం దగ్గరపడుతోంది. దీంతో ఆమె తెలివిగా ఆలోచించి.. కారు వదిలి పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌కు వెళ్లింది. ఎంచక్కా మెట్రో రైలులో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది. ముహూర్తం టైంకు పెళ్లి చేసుకుంది. ఈమె మెట్రోలో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పెళ్లి కూతురు చాలా స్మార్ట్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..