Tallest Woman Video: బ్రేకింగ్ రికార్డ్.. ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్ రికార్డు… అసలు ఎత్తు ఎంతటే..?(వీడియో)
టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గల్గీ ప్రంచంలోనే అతిపొడవైన మహిళగా గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పింది. నిలుచున్నప్పుడు ఈమె ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలతో ప్రపంచంలోనే పొడవైన వనితగా నిలిచింది. ఆమె చేతులు 24.5 సెంటిమీటర్లు పాదాలు 30.5 సెం.మీటర్ల పొడవు. అయితే...
Tallest Woman In The World Video: టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గల్గీ ప్రంచంలోనే అతిపొడవైన మహిళగా గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పింది. నిలుచున్నప్పుడు ఈమె ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలతో ప్రపంచంలోనే పొడవైన వనితగా నిలిచింది. ఆమె చేతులు 24.5 సెంటిమీటర్లు పాదాలు 30.5 సెం.మీటర్ల పొడవు..అయితే రుమేసా గిన్నిస్‌బుక్ రికార్డ్ సాధించడం ఇది తొలిసారి కాదు. ఆమెకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి టాలెస్ట్ మహిళా టీనేజర్‌గా గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించింది. అప్పుడు రుమేసా ఎత్తు 7 అడుగుల 9 అంగుళాలు రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు, కాళ్లు 30.5 సెంటీమీటర్లు పొడవు ఉన్నాయి.
అయితే, రుమేసా ఇంత పొడవు పెరగటానికి కారణం.. వీవర్ సిండ్రోమ్‌గా చెబుతున్నారు వైద్యులు..ఇది చాలా అరుదుగా కనిపించే సమస్య. ఈ సమస్య ఉన్నవాళ్లలో అస్థిపంజరం సాధారణం కంటే అధికంగా పెరిగిపోతుంది. ఇలా ఉన్నవాళ్లు స్వయంగా నడవడం కూడా కష్టమని చెబుతున్నారు. ఎక్కువగా వీరు ఇతరుల సాయం లేదా వీల్ చెయిర్, వాకర్ స్టిక్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రుమేసా ఎక్కువగా వీల్ చెయిర్‌ను వాడుతుంది. తనకు ఈ సిండ్రోమ్ ఉందని రుమేసా ఎప్పుడూ బాధపడకపోగా తనలాంటి వారికి..ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య అని, దీనిని అంగీకరించి ధైర్యంగా ఉండాలని చెబుతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)