డ్రమ్ములో మృతదేహం.. భార్యా పిల్లలు ఏమయ్యారు? వీడియో

Updated on: Aug 22, 2025 | 3:40 PM

రాజస్థాన్‌లోని అల్వర్‌లో డ్రమ్‌లో మృతదేహం కలకలం రేపింది. ఇంటి డాబాపైన ఒక డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో పురుషుని మృతదేహం సంచలనంగా మారింది. ఇంటి యజమాని ఏవో పనుల కోసం మొదటి అంతస్థుకు వెళ్లినప్పుడు, అక్కడ దుర్వాసన రావడాన్ని గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని, అతను ఇటుక బట్టీలో పనిచేస్తుంటాడని గుర్తించారు. ఘటన అనంతరం అతని భార్య, ముగ్గురు పిల్లలు ఇంటి యజమాని కుమారుడి సైతం పరారైనట్లు తెలిసింది.

నీలిరంగు డ్రమ్ములో మృతదేహాన్ని కుక్కి, దానిపై మూత ఉంచి, ఒక పెద్ద రాయిని దానిపై పెట్టారు. బాధితుడు నెలన్నర క్రితం ఇంటిని అద్దెకు తీసుకున్నాడని, డీఎస్‌పీ రాజేష్ కుమార్ మీడియాకు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించిందని మృతదేహం డ్రమ్ములో ఎంతకాలం నుంచి ఉందో, అతని హత్యకు గల కారణం ఏంటో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. డ్రమ్‌ హత్య అనగానే మీరట్‌లో గతంలో సంచలనం రేపిన ఘటనే అందరికీ గుర్తొస్తుంది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ ను భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసింది. శవాన్ని 15 ముక్కలుగా నరికి, డ్రమ్ములో వేసి, సిమెంట్‌తో కప్పేసింది. మార్చి 04వ తేదీన జరిగిన ఈ హత్య, సౌరభ్ మిస్సింగ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వేరే దేశంలో పనిచేస్తున్న సౌరభ్, తన 6 ఏళ్ల కూతురు పుట్టిన రోజు కోసం ఇండియాకు రాగా, పక్కా ప్లాన్‌తో భార్య, ఆమె లవర్ కలిసి హత్య చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

వామ్మో ఇవేం పాములురో బాబు.. కుప్పలు కుప్పలుగా వీడియో

పుట్టగొడుగుల కూర తిన్న జంట.. కాసేపటికే విషాదం వీడియో

అడవిలో అద్భుతం.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో

కొండచిలువలను వేటాడటంలో క్వీన్‌.. పదిరోజుల్లో ఏకంగా..