పసివాళ్లు దేవునితో సమానం అంటారు. కల్మషం లేని మనసుతో, బోసినవ్వులతో ఎంతటివారినైనా ఇట్టే ఆకర్షిస్తుంటారు. బంధం, బంధుత్వం, తన, పర భేదం వారికి తెలియదు. అలాంటి ఓ చిన్నారి కళ్లుసరిగా కనపడని ఒంటరి బామ్కకు ఆసరాగా నిలిచాడు. ఆ బామ్మ ఎప్పుడు ఎక్కడ కనిపించినా వెంటనే తనవద్దకు వెళ్తాడు. ఆమె ఊతకర్రను పట్టుకొని రోడ్డు దాటిస్తాడు. ఆమె వెళ్లాల్సిన చోటికి తీసుకెళ్లి జాగ్రత్తగా దించి వస్తాడు. ఈ చిన్నారి మంచి మనసుకు నెటిజన్లు, స్థానికులు ముగ్ధులవుతున్నారు. చిన్నారిని ఆశీర్వదిస్తున్నారు. ఖమ్మం నగరంలోని రామన్న పేట కాలనీ లో ఉంటున్న తిరుపతమ్మ కు నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు. ఆమె మొత్తం ఆరుగురు సంతానంలో కూతుళ్ళు , అల్లుళ్ళు కోడళ్ళు అందరూ చనిపోయారు. బామ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లు సరిగా కనపడవు. చుట్టుపక్కల వారు ఏదైనా పెడితే తింటూ కాలం వెళ్లబుచ్చుతోంది. ఆమె ఆహారం కోసం ఇంటింటికీ వెళ్లేటప్పుడు ఆ బామ్మ కనిపించిందంటే చాలు స్థానికంగా ఉండే ఓ బాలుడు మూడేళ్లు కూడా నిండి ఉండవు.. మాటలు కూడా సరిగా రాని ఆ చిన్నారి బామ్మవద్దకు పరుగెత్తుకెళ్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు ??