మీ బట్టలు కూడా మిమ్మల్ని ప్రమాదంలో పడేయవచ్చు..తస్మాత్‌ జాగ్రత్త!

|

Mar 12, 2024 | 12:57 PM

రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యం, అతివేగం, నిద్రమత్తు వంటివి కారణమవుతాయన్నది అందరికీ తెలిసిన విషయం. ఒక్కోసారి మనం ధరించే బట్టలు కూడా ఊహించని విధంగా మనల్ని ప్రమాదాల్లో పడేస్తుంటాయని మీకు తెలుసా? అవును అందుకు ఉదాహరణే సైబరాబాద్‌ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్‌ చేసి ఈ వీడియో. ఇది చూస్తే మన బట్టలే మనపాలిట మృత్యుకుహరాలవుతాయా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నలుపురంగు చొక్కా ధరించి రోడ్డు దాటుతున్నాడు. అతడు ధరించిన చొక్కా రంగు కారణంగా ఎదురుగా వస్తున్న వాహన డ్రైవర్‌కు దగ్గరకు వచ్చే వరకు ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడన్న సంగతి అతను గమనించలేకపోయాడు.

రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యం, అతివేగం, నిద్రమత్తు వంటివి కారణమవుతాయన్నది అందరికీ తెలిసిన విషయం. ఒక్కోసారి మనం ధరించే బట్టలు కూడా ఊహించని విధంగా మనల్ని ప్రమాదాల్లో పడేస్తుంటాయని మీకు తెలుసా? అవును అందుకు ఉదాహరణే సైబరాబాద్‌ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్‌ చేసి ఈ వీడియో. ఇది చూస్తే మన బట్టలే మనపాలిట మృత్యుకుహరాలవుతాయా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నలుపురంగు చొక్కా ధరించి రోడ్డు దాటుతున్నాడు. అతడు ధరించిన చొక్కా రంగు కారణంగా ఎదురుగా వస్తున్న వాహన డ్రైవర్‌కు దగ్గరకు వచ్చే వరకు ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడన్న సంగతి అతను గమనించలేకపోయాడు. దగ్గరగా వచ్చాక డ్రైవర్‌ రోడ్డుదాటుతున్న వ్యక్తిని గమనించి సడన్‌ బ్రేక్‌ వేయడంతో రెప్పపాటు కాలంలో అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు దుస్తులు కూడా ఒక కారణమని, కాబట్టి బైక్‌పై వెళ్లేవారు, పాదచారులు రాత్రివేళ నలుపు రంగు దుస్తులు ధరించవద్దని పోలీసులు కోరారు. రాత్రివేళ ప్రయాణంలో ఎప్పుడూ లేతరంగు దుస్తులు అంటే పసుపు, తెలుపు, పారట్‌ గ్రీన్‌ రంగు దుస్తులు ధరించాలని, లేదంటే రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలని, సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానం టేకాఫ్ చేస్తుండగా ఊడిపోయిన చక్రం.. ఆ తర్వాత ??

ఒంటరి మహిళలకు గుడ్‌ న్యూస్‌.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం

వంట గ్యాస్‌ సిలిండర్‌పై మరో రూ.100 తగ్గింపు

తుమ్మును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా ?? అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే

రూ.12,000 కోట్ల విలువ చేసే.. మానవ వెంట్రుకల అక్రమ రవాణా

Follow us on