Viral Video: హీరో అవుదామనుకున్నాడు.. బొక్కబోర్లా పడ్డాడు !! వైరల్‌ వీడియో

|

Feb 16, 2022 | 9:47 AM

కొందరు అందరి ముందు హీరోలుగా మారాలని ఫీలవుతుంటారు. అందరి దృష్టి తమపై పడాలని ఆశిస్తుంటారు. ఇందుకోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రకరకాల విన్యాసాలు చేస్తుంటారు.

కొందరు అందరి ముందు హీరోలుగా మారాలని ఫీలవుతుంటారు. అందరి దృష్టి తమపై పడాలని ఆశిస్తుంటారు. ఇందుకోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అందరి ముందుగా హీరోగా అవ్వాలనుకుంటే జీరోగా మారే అవకాశాలు ఉంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని చెబుతోంది. ఓ యువకుడు రేస్‌ బైక్‌ వేసుకొని చిన్న గల్లీలోకి వచ్చాడు. ఆ సమయంలో రోడ్డంతా వాహనాలతో నిండింది. దీంతో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాలనుకున్న కుర్రాడు బైక్‌ను ఒక్కసారిగా రేస్‌ చేసి ముందు టైర్‌ను గాల్లోకి లేపాడు. అక్కడున్న వారంతా తనని చూసి ఆశ్చర్యపోవాలనుకున్నాడా కుర్రాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు బైక్‌ అదుపు తప్పి ముందున్న కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బైక్‌తో సహా కింద పడిపోయాడు. అయితే తలకు హెల్మెట్‌, జర్కిన్‌ ధరించడంతో గాయాల నుంచి తప్పించుకున్నాడు.