ఒంటికాలిపై గెంతుతూ స్కూల్‌కి వెళ్తున్న బాలిక.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

ఒంటికాలిపై గెంతుతూ స్కూల్‌కి వెళ్తున్న బాలిక.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Phani CH

|

Updated on: May 28, 2022 | 8:44 AM

ఓ దివ్యాంగ విద్యార్థిని చదువుపై ఉన్న మక్కువతో స్కూలుకు వెళ్తున్న విధానం హృదయాలను కదిలిస్తోంది. ఈ బాలిక చక్కగా స్కూల్‌ యూనిఫాం వేసుకొని ఒంటికాలిపై స్కూల్‌కు వెళ్లే వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయ్యింది

ఓ దివ్యాంగ విద్యార్థిని చదువుపై ఉన్న మక్కువతో స్కూలుకు వెళ్తున్న విధానం హృదయాలను కదిలిస్తోంది. ఈ బాలిక చక్కగా స్కూల్‌ యూనిఫాం వేసుకొని ఒంటికాలిపై స్కూల్‌కు వెళ్లే వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయ్యింది. బీహార్ రాష్ట్రంలోని జాముయ్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థిని ప్రతిరోజూ కిలోమీట‌ర్ దూరంలో ఉన్న పాఠ‌శాల‌కు అలా గెంతుకుంటూ వెళ్తోంది. ఈ వీడియో ప్రముఖ న‌టుడు, స‌మాజ‌ సేవ‌కుడు సోనూసూద్ కంట‌ప‌డింది. ఆ చిన్నారి అవస్థ చూసి చలించిపోయిన సోనూసూద్‌ త్వర‌లోనే ఆమెకు స‌హాయం చేయ‌నున్నట్లు ప్రక‌టించారు. స్థానిక మీడియా ప్రకారం ఓ రోడ్డుప్రమాదంలో ఆ విద్యార్థిని కాలు కోల్పోయింది. అయినా, చదువుకోవాల‌నే ఆమె త‌ప‌న‌ముందు వైక‌ల్యం ఓడిపోయింది. ఒంటికాలిపై గెంతుతూ త‌న ల‌క్ష్యాన్ని సాధించేందుకు స్కూల్ బాట‌ప‌ట్టింది. ఆ విద్యార్థినికి చ‌దువుపై ఉన్న శ్రద్ధ సోనూసూద్‌ను క‌ట్టిప‌డేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వద్దని తెగేసి చెప్పి వెళ్లిపోయిన వధువు !! స్పృహ తప్పిన వరుడు !!

40 ఏళ్లుగా వంటగదిలో వృధాగా ఉంది.. ఇప్పుడు రూ. 11 కోట్లకు అమ్ముడుపోయింది !!

Published on: May 28, 2022 08:44 AM