Big Python: రోడ్డుపై భారీ కొండచిలువ.. భయం లేకుండా ఎదురెళ్లిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే.!

Updated on: Oct 08, 2022 | 9:56 AM

భయంకరమైన పాముజాతుల్లో కొండచిలువ కూడా ఒకటి. ఎంత పెద్ద జంతువైనా దీనికి భయపడాల్సిందే. దొరికిన జంతువు చిన్నదా, పెద్దదా అని చూడదు.. అమాంతం మింగేస్తుంది. అలాంటి కొండచిలువ నడిరోడ్డుపై మీకు దర్శనమిస్తే..


ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. భయంకరమైన పాముజాతుల్లో కొండచిలువ కూడా ఒకటి. ఎంత పెద్ద జంతువైనా దీనికి భయపడాల్సిందే. దొరికిన జంతువు చిన్నదా, పెద్దదా అని చూడదు.. అమాంతం మింగేస్తుంది. అలాంటి కొండచిలువ నడిరోడ్డుపై మీకు దర్శనమిస్తే.. పరిస్థితి ఏంటి? గజగజా వణికిపోతారు కదా.. కానీ ఓ వ్యక్తి అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. దారికి అడ్డంగా ఉన్న కొండ చిలువను గడ్డిపరకలా దాని తోకపట్టుకుని పక్కన పడేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ వైరల్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇందులో అర్ధరాత్రి వేళ ఓ భారీ కొండచిలువ రోడ్డు దాటుతుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన వాహనాన్ని పక్కనే ఆపి, సరాసరి కొండచిలువ దగ్గరకు వెళ్లి.. దాని తోక పట్టుకుని.. ఏమాత్రం భయం లేకుండా పొదల్లోకి విసిరేసాడు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాల ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Published on: Oct 08, 2022 09:56 AM