ప్రత్యర్థి విసిరిన పంచ్ యమపాశమైంది.. రింగ్‌లోనే కుప్పకూలిన యువ బాక్సర్
బెంగళూరు నగరభావి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి K1 కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి విసిరిన పంచ్‌కు ఓ యువ బాక్సర్ మృతి చెందాడు.
బెంగళూరు నగరభావి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి K1 కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి విసిరిన పంచ్‌కు ఓ యువ బాక్సర్ మృతి చెందాడు. ఈ ఘటనలో నిర్వాహకులు నిర్లక్ష్యం ఉండటంతో వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మృతుడు మైసూరులో నివాసముంటున్న విమల – సురేష్ దంపతుల చిన్న కుమారుడు 23 ఏళ్ల నిఖిల్‌గా తెలుస్తోంది. జ్ఞాన జ్యోతి నగర్‌లోని పాయ్ ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లో జరిగిన కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యర్థి విసిరిన పంచ్‌తో నిఖిల్ తలకు తీవ్ర గాయమైంది. అతడు స్పాట్‌లోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. మ్యాచ్ సందర్భంగా తీసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

