Viral Video: ప్రార్థనలతో చనిపోయిన తల్లిని బతికించుకునేందుకు ఓ యువకుని పిచ్చి ప్రయత్నం.

|

Aug 28, 2023 | 8:25 AM

నవమాసాలు మోసి కని పెంచిన తల్లి పట్ల ఓ కొడుకు పరితపించిపోయాడు. చనిపోయిన తల్లి బతికించుకునేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు. తల్లి కోసం ఓ కొడుకు చేసిన పని ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. ఆంద్రప్రదేశ్ రాజమండ్రీకి చెందిన ఓ యువకుడు.. తన తల్లిని తిరిగి బతికించుకునేందుకు వందల కిలో మీటర్లు ప్రయాణించి మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి చర్చికి చేరుకున్నాడు.

నవమాసాలు మోసి కని పెంచిన తల్లి పట్ల ఓ కొడుకు పరితపించిపోయాడు. చనిపోయిన తల్లి బతికించుకునేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు. తల్లి కోసం ఓ కొడుకు చేసిన పని ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. ఆంద్రప్రదేశ్ రాజమండ్రీకి చెందిన ఓ యువకుడు.. తన తల్లిని తిరిగి బతికించుకునేందుకు వందల కిలో మీటర్లు ప్రయాణించి మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి చర్చికి చేరుకున్నాడు. మృతదేహాన్ని చర్చి ముందు ఉంచి పాస్టర్‌ను తన తల్లిని బతికించాలంటూ వేడుకున్నాడు. కనికరించని చర్చి నిర్వహకులు అనుమతించకపోవడంతో మొండికేశాడు. దాదాపు మూడు గంటల పాటు ఆ చర్చి ముందే పడిగాపులుకాశాడు. నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చేసేది లేక తల్లి మృతదేహంతో సొంతూరికి తిరిగి పయనమయ్యాడు ఆ వ్యక్తి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని కల్వరి చర్చ్ ఎదుట జరిగింది. కల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్‌పై అత్యంత నమ్మకం పెంచుకున్నాడు రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి. ఆయన ప్రసంగాలతో అట్రాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆనారోగ్యంతో బాధపడుతున్న యువకుడి తల్లి మణికుమారి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చనిపోయింది. తన తల్లిని ఎలాగైనా పాస్టర్ ప్రవీణ్ బతికిస్తాడని.. అతను ప్రార్థనలు చేస్తే మరణించిన వారు సైతం తిరిగి వస్తారని మూఢనమ్మకంతో బెల్లంపల్లికి చేరుకున్నాడు. ఒక్కసారి పాస్టర్ దర్శనం కల్పించాలంటూ చర్చి నిర్వహకులను వేడుకున్నాడు. ఆదివారం తప్పా పాస్టర్‌ను కలవడం కుదరదని అక్కడినుంచి వెళ్ళిపోవాలంటూ నిర్వహకులు తరిమేశారు‌. ఆ వ్యక్తి ఎంతకీ వెళ్లకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. చివరికి నిరాశతో వెను తిరిగాడు ఆ వ్యక్తి.‌

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 28, 2023 08:25 AM