Dancing Trees: ఇండోనేషియాలోని వాలకిరి బీచ్‌లో సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో చెట్ల డాన్స్.. వీడియో
మనుషులకు సంతోషం వస్తే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డాన్స్‌లు వేస్తారు. అలాగే చెట్లు కూడా వాటికి సంతోషంగా అనిపించినప్పుడు డాన్స్ చేస్తాయట.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.
మనుషులకు సంతోషం వస్తే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డాన్స్‌లు వేస్తారు. అలాగే చెట్లు కూడా వాటికి సంతోషంగా అనిపించినప్పుడు డాన్స్ చేస్తాయట.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒక ద్వీపంలో చెట్లకు సంతోషం కలిగితే ఓ రేంజ్‌లో డాన్స్ చేస్తాయట. ఆ డాన్స్ చూడ్డానికి సాల్సా డాన్స్‌లా అనిపిస్తుందట. అయితే ఈ డాన్సింగ్ ట్రీస్ ఎక్కడున్నాయంటే… ఇండోనేషియాలోని సుంబా ద్వీపంలో ఒక బీచ్ ఉంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి, దీని పేరు వాలకిరి బీచ్. తెల్లని ఇసుక, “డాన్సింగ్ ట్రీస్” ఈ బీచ్ ప్రత్యేకత. ఈ బీచ్ లో ఇసుక తిన్నెలు, డాన్సింగ్ ట్రీస్ పర్యాటకులను కనువిందు చేస్తాయి. ప్రశాంతమైన సముద్ర తీరంలో ఇసుక తిన్నెల మీద ఈ చెట్లు వయ్యారంగా సాల్సా డ్యాన్స్ చేస్తుంటే చూపరులు కనులు తిప్పుకోలేరట.
మరిన్ని ఇక్కడ చూడండి: అంధకారంలో లెబనాన్.. భవనాల్లోని లైట్లు, కార్ల హెడ్ లైట్స్ తప్ప నగరం చీకటిమయం.. వీడియో