Bears: శ్రీకాకుళం జిల్లా పట్టపగలు వీధుల్లో ఎలుగుబంట్లు సంచారం.. వీడియో వైరల్.

|

Aug 31, 2023 | 10:28 PM

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధాన ప్రాంతం అంటే ఎలుగు బoట్ల సంచారం సహజం. అయితే ఒకప్పుడు కొండలు,గుట్టలు, తోటల్లో ఉండే ఎలుగుబంట్లు ఇటీవల రాత్రిపూట జనావాసాలలోకి చొరబడటం పరిపాటిగా మారింది. ఇప్పుడైతే ఏకంగా పట్టపగలే గ్రామాల్లోకి వస్తూ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలోకి ఎలుగుబంటి చొరబడింది. వీధుల్లో ఎదేచ్చగా తిరుగుతూ హల్ చల్ చేసింది.

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధాన ప్రాంతం అంటే ఎలుగు బoట్ల సంచారం సహజం. అయితే ఒకప్పుడు కొండలు,గుట్టలు, తోటల్లో ఉండే ఎలుగుబంట్లు ఇటీవల రాత్రిపూట జనావాసాలలోకి చొరబడటం పరిపాటిగా మారింది. ఇప్పుడైతే ఏకంగా పట్టపగలే గ్రామాల్లోకి వస్తూ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలోకి ఎలుగుబంటి చొరబడింది. వీధుల్లో ఎదేచ్చగా తిరుగుతూ హల్ చల్ చేసింది. భయంతో గ్రామస్తులు కేకలు వేస్తూ తరిమి వేసే ప్రయత్నం చేసిన ఫలితం లేదు. సుమారు గంటపాటు గ్రామ వీధుల్లో సంచరిస్తూ గ్రామస్థులను హడలెత్తించిoది. ఇంటింటికి తిరిగుతూ ఆహారం కోసం వెతుకుతూ కంగారెత్తించింది. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు ఇళ్ళ నుండి బయటకు రాడానికి భయపడిపోయారు. ఇటీవల తరచూ ఎలుగుబంట్లు ఇలా గ్రామాల్లోకి వస్తుండటంతో తీవ్ర అవేదనకు గురవుతున్నారు. ఏక్షణం ఎవరిపై దాడిచేస్తుందోనని హడలిపోతున్నారు. ఎలుగుబంట్లు బారినుంచి తమకు రక్షణ కల్పించాలని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..