TTD Cows: టీటీడీకి 1000 ఆవులిస్తా.! సొంతంగా నెయ్యి తయారుచేసుకోవచ్చు..

|

Oct 11, 2024 | 7:58 PM

తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతున్న వేళ భారత చైతన్య యువజన పార్టీ బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ ముఖ్య ప్రకటన చేశారు. టీటీడీకి తాను వెయ్యి గోవుల్ని ఇస్తానని, వాటితో డెయిరీ ఫాం పెట్టి నెయ్యి తయారుచేసి ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదాలకు ఉపయోగించవచ్చంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు.

టీటీడీకి సొంత డెయిరీ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వం కనుక డెయిరీ ఏర్పాటుకు రెడీగా ఉంటే తాను వెయ్యి ఆవుల్ని ఇస్తానని అన్నారు. అంతేకాదు, మరో లక్ష గోవుల్ని ఉచితంగా తిరుమలకు తరలించే బాధ్యతను కూడా తాను తీసుకుంటానని చెప్పారు. లక్ష ఆవుల నుంచి రోజుకు పది లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అయినా దాదాపు 50 వేల కేజీల వెన్న వస్తుందని, దాని నుంచి సుమారు 30 వేల కేజీల నెయ్యి ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఆ నెయ్యిని స్వామివారి ధూప, దీప నైవేద్యాలు, లడ్డూ తయారీ కోసం ఉపయోగించవచ్చని, మిగతా నెయ్యిని ఇతర ఆలయాలకు కూడా సరఫరా చేయవచ్చని అన్నారు. ఇలా చేస్తే నెయ్యి కల్తీ జరగకుండా ఉంటుందని అభిప్రాయడ్డారు. అలాగే, టీటీడీ పాలకమండలిలో ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలని కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on