Viral Video: ఎయిర్‌హోస్టెస్‌ను ముద్దాడబోయిన.. కటకటాలపాలయ్యాడు.!
మెట్రో రైళ్లలోనే కాదు విమానాల్లోనూ ప్రయాణికులు రెచ్చిపోతున్నారు. తోటి ప్రయాణికులు, విమానసిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ బంగ్లాదేశ్ ప్రయాణికుడు విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ను ముద్దు పెట్టుకోబోయాడు. ప్రతిఫలంగా జైలుపాలయ్యాడు. ఈ ఘటన విస్తారా విమానంలో చోటుచేసుకుంది.
మెట్రో రైళ్లలోనే కాదు విమానాల్లోనూ ప్రయాణికులు రెచ్చిపోతున్నారు. తోటి ప్రయాణికులు, విమానసిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ బంగ్లాదేశ్ ప్రయాణికుడు విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ను ముద్దు పెట్టుకోబోయాడు. ప్రతిఫలంగా జైలుపాలయ్యాడు. ఈ ఘటన విస్తారా విమానంలో చోటుచేసుకుంది. విస్తారా విమానం సెప్టెంబరు 6న మస్కట్ నుంచి ఢాకాకు బయలుదేరింది. విమానం మరికాసేపట్లో ముంబైలో ల్యాండ్ అవుతుందనగా బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ దులాల్ అనే ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అతడిని మందలించే ప్రయత్నం చేశారు. అయినా అతను తన వెకిలి చేష్టలు ఆపలేదు సరికదా వారితోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కెప్టెన్ జోక్యం చేసుకుని రెడ్ వార్నింగ్ కార్డ్ చదివి అతడిని వికృత ప్రయాణికుడిగా ప్రకటించాడు. అనంతరం విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. న్యాయమూర్తి అతడిని పోస్ట్ కస్టడీకి ఆదేశించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

