Padma Pulasa Fishes: పద్మా పులస వచ్చేస్తోంది.. దుర్గా నవరాత్రులకు స్పెషల్‌ గిఫ్ట్.. వీడియో

|

Sep 25, 2023 | 9:22 AM

బెంగాళీలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది బంగ్లాదేశ్‌. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారత్‌కు పద్మా పులస ఎగుమతికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అంగీకరించింది. దసరా పండుగ సీజన్‌కు ముందుగా దాదాపు 3,950 మిలియన్‌ టన్నుల పద్మా పులసలను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ పద్మా పులసను బెంగాలీలు చాలా ప్రత్యేకం. బెంగాల్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

బెంగాళీలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది బంగ్లాదేశ్‌. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారత్‌కు పద్మా పులస ఎగుమతికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అంగీకరించింది. దసరా పండుగ సీజన్‌కు ముందుగా దాదాపు 3,950 మిలియన్‌ టన్నుల పద్మా పులసలను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ పద్మా పులసను బెంగాలీలు చాలా ప్రత్యేకం. బెంగాల్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. దసరా పండుగ సీజన్‌లో బెంగాళీలు పద్మా పులస చేపలను ఎంతో ప్రత్యేకంగా వండుకుని ఆరగిస్తారు. కొందరు దుర్గామాతకు నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఈ నేపధ్యంలో బెంగాళీల దసరా పండుగకు గిఫ్ట్‌గా పద్మా పులస లేదా పద్మా హిలస చేపల ఎగుమతికి బంగ్లా ప్రభుత్వం ఓకే చెప్పడంతో బెంగాళీల్లో ఆనందం వెల్లివిరిసింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా దేవీ నవరాత్రులు రానున్న నేపథ్యంలో హిల్సా చేపలను భారత్‌కు కానుకగా పంపిస్తున్నట్లు ప్రకటించారు. దుర్గాపూజ సీజన్‌కి ముందు 4000 మెట్రిక్ టన్నులు హిల్సా చేపలను ఎగుమతి చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 20న వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. భారత్‌ చేపల వ్యాపారుల ద్వారా పద్మా హిలస చేపలు భారత్‌కు అక్టోబర్ 30 వరకు విడతల వారిగా చేరుకుంటాయి. కాగా సెప్టెంబర్‌ 21 నుంచే బెంగాల్‌లో పద్మా పులస రాక ప్రారంభమైంది. బంగ్లా నుంచి పద్మా పులస పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో దిగుమతి జరుగుతుంది. అక్కడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చేపల వ్యాపారుల ద్వారా సరఫరా అవుతాయి. బెంగాల్ మార్కెట్‌లో ప్రస్తుతం పద్మా పులస ధర కిలో సుమారు 1000 రూపాయలుగా ఉంది. బంగ్లాదేశ్‌లోని ప్రముఖ నదుల్లో పద్మా నది ఒకటి. ఈ నదిలో మాత్రమే పులసలు దొరుకుతాయి. అందువల్లనే ఈ చేపలకు పద్మా పులస అనే పేరు వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..