బైకర్‌ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్‌

Updated on: Jan 12, 2026 | 10:19 AM

బెంగళూరులో ఓ ట్రాఫిక్ పోలీస్ బైకర్‌ను కొట్టిన వీడియో వైరల్ అయింది. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే జరిమానా విధించవచ్చు కానీ చేయి చేసుకోవడం తప్పు అని నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో, ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఇలాంటి చర్యలు పోలీసులపై ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తున్నాయని విస్తృత చర్చ జరుగుతోంది.

ట్రాఫిక్ పోలీసులకు వాహనాలను ఆపడానికి, రూల్స్ ఉల్లంఘన పై జరిమానా విధించడానికి అధికారం ఉంటుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే తప్ప చేయి చేసుకోవడానికి హక్కు లేదని నెటిజన్లు ఓ వీడియోపై విమర్శిస్తున్నారు. ఓ ట్రాఫిక్ పోలీస్ పై యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరులో ఒక ట్రాఫిక్ పోలీస్ ఓ బైకర్ తో వాదిస్తూ చెంపదెబ్బ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైరల్ వీడియోపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసులు చేయి చేసుకుంటున్న ఘటనల గురించి ప్రజల్లో చర్చ మొదలైంది. ఓ ట్రాఫిక్ పోలీస్, బైకర్ మొదట కోపంగా వాదించుకున్నారు. తర్వాత అందరూ చూస్తుండగానే ట్రాఫిక్ పోలీస్ ఒక్కసారిగా బైకర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. కొందరు సోషల్ మీడియా యూజర్లు బెంగళూరు సిటీ పోలీస్ & ట్రాఫిక్ కి ట్యాగ్ చేసారు. దీని పై వెంటనే చర్యలు తీసుకోవాలని, కర్ణాటకలో పోలీసుల పనితీరు నిరూపించుకోవాలని కోరుతూ పోస్ట్ చేసారు. మరొకరు ఆ బైకర్‌ ఎవరో కనిపెట్టండి, ఆ పోలీసు కానిస్టేబుల్పై కేసు పెట్టి పరిహారం ఇప్పించడానికి తను సహాయం చేస్తానని అన్నారు. ఇంకో యూజర్ ఆ పోలీసుపై ఏం చర్య తీసుకున్నారు ? చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తున్నాయని చాలామంది కామెంట్‌ చేసారు. ఇలాంటి పనులు పోలీస్ శాఖకు చెడ్డ పేరు తెస్తాయి అని కామెంట్ పెట్టారు. పోలీస్ ఉన్నత అధికారులు ట్రాఫిక్ పోలీస్ పై చర్యలు తీసుకున్నారు. ఆ ట్రాఫిక్ పోలీస్ ని సస్పెండ్ చేసినట్లు బెంగళూరు ట్రాఫిక్ డీసీపీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందు కూడా పోలీసులు కోపంగా వాదించడం, చెయ్యి చేసుకోవడం వంటి వీడియోలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టెన్త్‌ పరీక్షల్లో మార్కులు కొట్టేయాలంటే

Published on: Jan 12, 2026 09:52 AM