వేగంగా దూసుకెళ్తున్న కారు.. సైడ్ మిర్రర్ నుంచి సైలెంట్‌గా వచ్చిన పాము.. కట్ చేస్తే

Updated on: Nov 14, 2025 | 11:49 AM

ఇటీవల బెంగళూరులో కారు సైడ్ మిర్రర్ నుంచి పాము బయటకు వచ్చి భయాందోళన సృష్టించింది. ఈ షాకింగ్ ఘటన వీడియో వైరల్ అయ్యింది. వర్షాలు, చలి కారణంగా పాములు వెచ్చదనం కోసం వాహనాల్లోకి చొరబడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, బయలుదేరే ముందు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం తప్పనిసరి.

ఇటీవలకాలంలో పాములు జనావాసాల్లోకి చొరబడుతూ ఎక్కడపడితే అక్కడ తిష్ట వేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజగా బెంగుళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నామక్కల్ సాలెం రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఇంతలో సైడ్‌ మిర్రర్‌నుంచి ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. పామును చూసి ఆవ్యక్తి భయంతో షాకయ్యాడు. అది లోపలికి ఎక్కడ దూసుకొస్తుందో, తనపైన దాడిచేస్తుందేమోనని ఆందోళనకు గురయ్యాడు. వెంటనే కారును పక్కకు ఆపి కారు దిగిపోయాడు. కాసేపటికి పాము అద్దంలోనుంచి బయటకు వచ్చి కిందపడి తనదారిన వెళ్లిపోయింది. కారు దూసుకెళ్తుండగా సైడ్‌ మిర్రర్‌లోనుంచి పాము బయటకు రావడం..అది ఎటు వెళ్లాలో తెలియక వేలాడుతూ ఉండటం.. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు చూసి షాకయ్యారు. కారులోని వ్యక్తి చూసాడో లేదోనని అతడిని అలర్ట్‌ చేశారు. అప్పటికే పామును గుర్తించిన కారులోని వ్యక్తి కారును పక్కకు ఆపి దిగిపోవడంతో అతను ప్రమాదంనుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఓవైపు వర్షాలు, మరోవైపు చలి వాతావరణంతో పాములు, ఇతర జీవులు పార్క్ చేసిన వాహనాల్లో వెచ్చదనం కోసం వచ్చి చేరతాయని, ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. బయలుదేరేముందు వాహనాలను ఓసారి క్షుణ్ణంగా చెక్‌ చేసుకొని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న రక్త పరీక్షతో క్యాన్సర్ ముప్పు గుర్తింపు

అది రైలు బ్రో.. మన ఇల్లు కాదు.. అలా ఎలా చేస్తావ్ ??

ఈమె టెక్నిక్ చూస్తే.. ప్రతి ఇంట్లో ఆడోళ్లు ఇలానే చేస్తారేమో.. ఐడియాకి సెల్యూట్‌ చెయ్యాల్సిందే

సూట్‌కేసులో నుంచి వింత శబ్దాలు.. ఓపెన్‌ చేసి చూడగా షాక్‌

వామ్మో.. ఒక్కపీత ఖరీదు నాలుగు వేలా ??