వావ్ .. నేచురల్ వాష్ బేషిన్.. ఐడియా అద్దిరిపోలా !!
ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ వాష్ బేసిన్ కామన్. సాధారణంగా వీటిని సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారు చేస్తారు. అలాగే గ్రానైట్‌తో చేసినవి కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా నేచురల్ వాష్ బేసిన్ ప్రకృతి ప్రసాదించిన వనరులతో చేసిన వాష్ బేసిన్ ఎప్పుడైనా చూశారా. నేచురల్ వాష్ బేసిన్ ఏంటి అని అనుకుంటున్నారా? అవును ఇది వెదురుతో చేసిన వాష్ బేసిన్. నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా షేర్ చేసిన ఈ వాష్ బేసిన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ వాష్ బేసిన్ కామన్. సాధారణంగా వీటిని సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారు చేస్తారు. అలాగే గ్రానైట్‌తో చేసినవి కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా నేచురల్ వాష్ బేసిన్ ప్రకృతి ప్రసాదించిన వనరులతో చేసిన వాష్ బేసిన్ ఎప్పుడైనా చూశారా. నేచురల్ వాష్ బేసిన్ ఏంటి అని అనుకుంటున్నారా? అవును ఇది వెదురుతో చేసిన వాష్ బేసిన్. నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా షేర్ చేసిన ఈ వాష్ బేసిన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వాష్ బేసిన్‌లు నాగాలాండ్‌లోని చాలా గ్రామాల్లో కనిపిస్తాయి. అక్కడ వెదురు బొంగులనే పైపులుగా ఉపయోగిస్తుంటారు. కొండల పై నుంచి పారే నీరు అక్కడి వారికి ఆధారం. వెదురు బొంగుకు మధ్యలో తొర్ర పెట్టి, దాన్ని నీటితో నింపుతారు. ఓ వైపున ట్యాప్ మాదిరిగా చిన్న చిన్న చిల్లులు పెట్టి చిన్న స్టిక్ తో వాటిని మూసివేస్తారు. చేతులు కడుక్కోవాల్సి వచ్చినప్పుడల్లా ఆ పుల్ల బయటకు లాగడం, వాడుకున్న తర్వాత దాంతో తిరిగి మూసేయడం చేస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిసెప్షన్‌పై ఎలుగుబంటి దాడి !! కొత్త జంటకు మిగల్చకుండా తినేసింది !!