Bachelors protest: మహారాష్ట్రలో బ్రహ్మచారుల వింత నిరసన.. గుర్రాలతో ర్యాలీ..! పెళ్లి కావడం లేదని ఆవేదన..

|

Dec 31, 2022 | 8:28 AM

మహారాష్ట్రలో యువకులు కదం తొక్కారు. శోలాపుర్‌ జిల్లాలో పెళ్లి కాని యువకులు వింత నిరసన చేపట్టారు. వివాహాలు చేసుకోటానికి అమ్మాయిలు దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మహారాష్ట్రలో యువకులు కదం తొక్కారు. శోలాపుర్‌ జిల్లాలో పెళ్లి కాని యువకులు వింత నిరసన చేపట్టారు. వివాహాలు చేసుకోటానికి అమ్మాయిలు దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రాంతి జ్యోతి పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు పెళ్లి కాని యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలపై ఊరేగింపుగా వచ్చి శోలాపుర్‌ కలెక్టరేటు ఎదుట బైఠాయించారు. రాష్ట్రంలో పురుషులకు సరిపడా మహిళల సంఖ్య లేదని క్రాంతి జ్యోతి పరిషత్‌ ఛైర్మన్‌ రమేశ్‌ భాస్కర్‌ తెలిపారు. చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడ్డ తమకు పెళ్లిళ్లు కావడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగ నిర్ధరణ చట్టం పటిష్ఠంగా అమలు కాకపోవటమే కారణమని బ్రహ్మచారులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 31, 2022 08:28 AM