శిశువు చనిపోయిందని ఖననం చేస్తున్న సమయంలో అద్భుతం

Updated on: Jul 20, 2025 | 6:41 PM

అనారోగ్యంతో బాధపడే వ్యక్తి చికిత్స కోసం వచ్చినప్పుడు వైద్యులు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. రోగికి ధైర్యం చెబుతారు, తగిన చికిత్స చేస్తారు. కొందరు వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవరిస్తారు. రోగులను సరిగా పట్టించుకోకుండా ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తారు. ఒక్కోసారి బ్రతికి ఉన్న రోగినే చనిపోయాడని ప్రకటిస్తారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్ర బీదర్‌లోని ఓ ఆస్పత్రిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వైద్యులు చనిపోయిందని ప్రకటించిన ఓ శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. ఓ మహిళ 7వ నెలలోనే శిశువుకు జన్మనిచ్చింది. బరువు తక్కువగా ఉండటంతో.. ఆ బేబీని రాత్రంతా ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ.. శిశువు అంత్యక్రియల కోసం తమ గ్రామానికి తీసుకెళ్లారు. గ్రామానికి చేరుకునేసరికి రాత్రి కావడంతో తెల్లారి అంత్యక్రియలు చేయాలని ఆ శిశువు మృతదేహాన్ని శవపేటికలో ఉంచారు. మర్నాడు శిశువును ఖననం చేసేందుకు స్మశానవాటికకు తీసుకువెళ్లారు. అక్కడ ఖననం చేస్తున్న సమయంలో శిశువులో కదలిక కనిపించింది. 12 గంటల పాటు శవపేటికలో ఎటువంటి కదలిక లేకుండా ఉన్న శిశువులో ఒక్కసారిగా కదలికలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా అంత్యక్రియలు నిర్వహించే సమయంలో తాను బ్రతికే ఉన్నానంటూ ఆ శిశువు కేర్‌..ర్‌..ర్‌ మంటూ ఏడ్చింది. ఈ ఘటనతో షాకయిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమ పెళ్లికి శిక్షగా.. పొలం దున్నించారు..

యానాం వద్ద దొరికిన తొలి పులస.. ధర తెలిస్తే షాకే..

ఒక్క సెక‌నులో నెట్‌ఫ్లిక్స్ వీడియోలు మొత్తం డౌన్‌లోడ్

తాయత్తులు, రాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తి