తోకతో పుట్టిన ఆడశిశువు.. అరుదుగా ‘ట్రూ టెయిల్స్’ శిశువుల జననం..
మెక్సికోలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య మెక్సికోలోని న్యూవో లియోన్ ఆస్పత్రిలో ఓ ఆడ శిశువు 2 అంగుళాల తోకతో జన్మించింది. మృదువైన చర్మంతో, పదునైన మొన కలిగి 3 నుంచి 5 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఈ తోక ఉందని వైద్యులు తెలిపారు.
మెక్సికోలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య మెక్సికోలోని న్యూవో లియోన్ ఆస్పత్రిలో ఓ ఆడ శిశువు 2 అంగుళాల తోకతో జన్మించింది. మృదువైన చర్మంతో, పదునైన మొన కలిగి 3 నుంచి 5 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఈ తోక ఉందని వైద్యులు తెలిపారు. ఆ తోక స్పర్శను కలిగి ఉండటం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని వెల్లడించారు. ఆ తోకను ఆపరేషన్ చేసి తొలగించామని, ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యంగా ఉందని వివరించారు. ఇప్పుడు ఈ తోక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ‘ట్రూ టెయిల్స్’ అత్యంత అరుదుగా జరుగుతాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటివి 2017 నాటికి 195 కేసులు గుర్తించారు. 2021లో ఒక బ్రెజిలియన్ శిశువు కూడా తోకతో జన్మించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారానికి 4 రోజులే వర్కింగ్ డేస్..
Digital TOP 9 NEWS: చిన్నారి ప్రాణం తీసిన కోతి..ఏం జరిగిందంటే.! | రైలు ఎక్కలేక ఇబ్బందిపడ్డ మహిళ