Baby elephant: హోం సో క్యూట్.. పాల కోసం పిల్ల ఏనుగు ఏం చేసిందో చూస్తే ఫిదా అవుతారు.. వీడియో.
పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. పలు సందర్భాల్లో వాళ్లు చేసే మారాం తల్లి మాత్రమే కాదే, ఎవరైనా కరిగిపోవాల్సింది. అది మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.
ఈ వీడియోలో ఓ పార్క్‌లో సందర్శకులు ఏనుగులు ఉండే ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. కొందరు అక్కడున్న చిన్న హోటల్ లాంటిదానిలో కూర్చుని ఏవో తింటున్నారు. ఇంతలో అక్కడికి ఓ గున్న ఏనుగు వచ్చింది. దాని కేర్ టేకర్ ఆ ఏనుగుపిల్ల కోసం పాలు రెడీ చేస్తున్నాడు. అతను బాటిల్‌లో పాలను నింపుతున్నాడు. అది తనకోసమే అని గమనించిన ఆ గున్న ఏనుగు త్వరగా ఇమ్మని అతనికి వంగి వంగి సలాం చేస్తుంది. కలిపింది చాలు త్వరగా ఇవ్వు స్వామి అన్నట్టుగా తొండంతో సైగలు చేస్తుంది. పనిలో పనిగా అక్కడ కూర్చున్న పర్యాటకులకు కూడా మీరైనా చెప్పండి అన్నట్టు వాళ్లకి కూడా వంగి ఓ నమస్కారం చేసింది. ఈ వైరల్ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్యూట్ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను పది లక్షలమందికి పైగా వీక్షించారు. కాగా బేబీ ఎలిఫెంట్ సూపర్ క్యూట్ అని కొందరు యూజర్లు కామెంట్ చేయగా కొందరు మాత్రం ఆ కేర్ టేకర్ తీరుపై మండిపడుతున్నారు. జంతువులను అలా యాచించేలా చేయడం సరైంది కాదని రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos