అప్పుడే పుట్టిన బిడ్డను చూడబోయిన తల్లి.. తీరా కనిపించిన దృశ్యానికి మైండ్ బ్లాంక్ !!
మధ్యప్రదేశ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శివ్‌పూరి జిల్లాలోని మనపురా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జన్యులోపంతో కూడిన ఓ శిశువు జన్మించింది.
మధ్యప్రదేశ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శివ్‌పూరి జిల్లాలోని మనపురా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జన్యులోపంతో కూడిన ఓ శిశువు జన్మించింది. కాళ్లు బదులుగా కొమ్ము లాంటి శరీర నిర్మాణం ఉండటంతో తల్లిదండ్రులతో సహా, ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. సదరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆగష్టు 26వ తేదీన ఈ శిశువు జన్మించినట్లు తెలుస్తోంది. ఆ వింత శిశువును చూసి ఆందోళన చెందిన ఆరోగ్య కేంద్ర సిబ్బంది మెరుగైన వైద్యం కోసం సదరు శిశువు, తల్లిని శివ్‌పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, నవజాత శిశువు సరిగ్గా అభివృద్ధి చెందలేదని.. కేవలం 1.04 కిలోల బరువు మాత్రమే ఉందని జిల్లా ఆస్పత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. ఇది నవజాత శిశువుల సాధారణ బరువు కంటే చాలా తక్కువని.. వైద్యపరంగా ఈ ఘటన అరుదుగా ఉన్నప్పటికీ, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆ శిశువు ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉందని చెప్పారు. సాధారణంగా గర్భంలోని శిశువు అభివృద్ధి చెందకపోతే.. వైకల్యం లేదా బరువు తక్కువగా ఉండటం జరుగుతుందని వైద్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందుకే కోతి చేష్టలు అనేది.. సేదతీరుతున్న పులులతో పరాచకాలు.. కట్ చేస్తే
కడుపుమాడ్చి పిల్లాడిని చంపిన తల్లి !! జీవిత ఖైదు విధించిన కోర్టు !!
‘బాహుబలి సమోసా’ ఛాలెంజ్.. మూడు నిమిషాల్లో పూర్తి చేస్తే భారీ బహుమతి
కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్న 9 ఏళ్ల బాలిక.. ఏమైందని ఆరా తీయగా !!
World Biggest Temple: ప్రపంచంలోనే ఇంత పెద్ద ఆలయం ఎక్కడా చూసి ఉండరు