AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indigo flight: విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

Indigo flight: విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

Anil kumar poka
|

Updated on: Apr 16, 2024 | 8:33 PM

Share

ఇటీవల విమానాల్లో తరచూ ఏదొక ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తలుపులు ఊడి పడటం, ఇంజిన్‌ కవర్లు ఊడిపోవడం, సీట్లు విరిగిపోవడం, సాంకేతిక లోపాలు తలెత్తడం జరుగుతున్నాయి. ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా అయోధ్య నుంచి ఢిల్లీ బయల్దేరిన ఇండిగో విమానాన్ని ప్రమాదకర పరిస్థితిలో దారి మళ్లించాల్సి వచ్చింది.

అయోధ్యనుంచి సాయంత్రం మూడున్నర గంటల సమయంలో బయలుదేరిన విమానం అదేరోజు 4.30 గంటలకు ఢిల్లీ చేరుకోవాలి. అయితే ఇంకో 15 నిమిషాల్లో ఢిల్లీ చేరుకుంటామనగా పైలట్‌ ఓ ప్రకటన చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం ల్యాండింగ్‌ కష్టంగా మారిందని, ఇంధనం కూడా అయిపోతోందని తెలిపారు. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. విమానం అక్కడక్కడే గాల్లో చక్కర్లు కొడుతూ ల్యాండింగ్‌కి ప్రయత్నించినా ఫలితం లేదు. దాంతో విమానాన్ని చండీగఢ్‌కు మళ్లించి, ప్రయాణికులను సురక్షితంగా దింపారు. అయితే ఆ సమయానికి విమానంలో కేవలం 1-2 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలి ఉండగా.. తాము ల్యాండ్ అయ్యామని తెలిసిందని ఓ ప్రయాణికుడు ఆరోజు తాము ఎదుర్కొన్న పరిస్థితిని వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దానిని డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖకు ట్యాగ్ చేశారు. మీరు అసలు నియమావళిని పాటించారా..? అని ఇండిగో సంస్థను ప్రశ్నించారు. ఇది పూర్తి భద్రతా వైఫల్యం.. దీనిపై DGCA దర్యాప్తు చేయాలని మరో ప్రయాణికుడు డిమాండ్ చేశారు. అయితే ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం.. ఒకసారి మాత్రమే ఢిల్లీలో దింపేందుకు పైలట్‌ ప్రయత్నించారని, రెండోయత్నానికి అనుమతి లభించకపోవడంతో చండీగఢ్‌కు మళ్లించినట్లు ఉంది. దీనిపై విమానయాన సంస్థ నుంచి ప్రస్తుతం ఎలాంటి స్పందనా రాలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!