Yoga Viral: యోగాతో పొట్టపై నవ దుర్గా రూపాలు.. అదిరిపోయే వీడియోవైరల్..
యోగా ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అందుకే వైద్యులు సైతం యోగా చేయమని సూచిస్తుంటారు. ఈ యోగాతో కళలను కూడా ప్రదర్శించవచ్చంటున్నారు ఆథ్యాత్మిక యోగా గురువు సచ్చిదానంద యోగి. యోగాలోని నౌలి క్రియ ద్వారా గతంలో కూడా అకే కళాఖండాలను తన పొట్టపై ప్రదర్శించారు సచ్చిదానంద. తాజాగా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి 9 రూపాలను తన పొట్టపై చిత్రించుకుని అద్భుత ప్రదర్శన ఇచ్చారు.
యోగా ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అందుకే వైద్యులు సైతం యోగా చేయమని సూచిస్తుంటారు. ఈ యోగాతో కళలను కూడా ప్రదర్శించవచ్చంటున్నారు ఆథ్యాత్మిక యోగా గురువు సచ్చిదానంద యోగి. యోగాలోని నౌలి క్రియ ద్వారా గతంలో కూడా అకే కళాఖండాలను తన పొట్టపై ప్రదర్శించారు సచ్చిదానంద. తాజాగా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి 9 రూపాలను తన పొట్టపై చిత్రించుకుని అద్భుత ప్రదర్శన ఇచ్చారు. కాకినాడ ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి తొమ్మిది రూపాలను తన పొట్ట కండరాలపై రూపొందించారు.. యోగాలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియతో వివిధ దుర్గ అవతారాలను చిత్రీకరించి చూపించారు.. వారాహి దేవి, కాళీ మాత, అన్నపూర్ణ దేవి, దుర్గ దేవి, ప్రత్యంగిరా దేవి, మహా లక్ష్మీ, సరస్వతీ దేవి, మహిషాసుర మర్థినీ, లలితా త్రిపుర సుందరి దేవి… ఒక్కో రోజు ఒక్కో అవతార రూపాన్ని తన పొట్టపై చూపించి అమ్మవారిపై తన భక్తిని చాటుకున్నారు. ఈ ప్రక్రియ చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. తన పొట్టపై చూపిన వివిధ ఆకృతులకు గాను గతంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తాజాగా నవదుర్గ ఆకృతులతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానాన్ని పొందారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..