AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Kejriwal: రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆటోవాలా షాక్‌.. ఇంటికి పిలిచి భోజనం పెట్టి.. చివరిలో..

CM Kejriwal: రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆటోవాలా షాక్‌.. ఇంటికి పిలిచి భోజనం పెట్టి.. చివరిలో..

Anil kumar poka
|

Updated on: Oct 08, 2022 | 9:05 AM

Share

కేజ్రీవాల్‌ను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టిన విక్రమ్ దంతాని అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ బ్యాడ్జ్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసిన మీడియా..


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌ షాకిచ్చాడు ఓ ఆటోవాలా. ఇంటికి పిలిచి భోజనం పెట్టిన ఆ ఆటో డ్రైవర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గుజరాత్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ విక్రమ్‌ దంతానీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అంటే వీరాభిమానం. ఈ క్రమంలో  అహ్మదాబాద్‌లో ఆప్‌ నిర్వహించిన ఓ సమావేశానికి వెళ్లాడు దంతాని. ఈ సందర్భంగా సీఎంను తమ ఇంటికి భోజనాకికి రావల్సిందిగా ఆహ్వానించాడు. అందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించి దంతానీ ఇంటికి భోజనానికి వెళ్లారు. అప్పట్లో ఈ వార్త సంచలమైంది. కేజ్రీవాల్‌పై ఇంత అభిమానం కురిపించిన దంతానీ తాజాగా సీఎంకు ఊహించని షాకిచ్చారు. కేజ్రీవాల్‌ను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టిన విక్రమ్ దంతాని అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ బ్యాడ్జ్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసిన మీడియా ‘ఇదేంటని’ ప్రశ్నించింది. అందుఉక విక్రమ్ దంతానీ.. తాను నిజానికి బీజేపీ అభిమానినని, రానున్న ఎన్నికల్లో తన ఓటు బీజేపీకేనని స్పష్టం చేశాడు. కేజ్రీవాల్‌ను ఓ అతిథిగానే ఇంటికి ఆహ్వానించానని చెప్పుకొచ్చాడు. కేజ్రీవాల్‌తో భేటీ తర్వాత ఆప్ నాయకులెవరూ తనను కలవలేదన్న ఆయన.. తనకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేది బీజేపీ కార్యకర్తలేనని వివరించాడు. ఇప్పుడాయన వ్యాఖ్యలు ‘టాక్ ఆఫ్ ద టౌన్’ అయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Published on: Oct 08, 2022 09:05 AM