Viral: రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో.

Viral: రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 24, 2024 | 4:34 PM

మహారాష్ట్రలోని థానెలో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. ముందు వెళుతున్న కారును ఢీ కొట్టాడు. అప్పటికీ కోపం చల్లారలేదేమో ముందుకు వెళ్లి తిరిగి వచ్చి మరోసారి వేగంగా ఢీ కొట్టాడు. చుట్టుపక్కల జనం అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారి పైకి కారుతో దూసుకెళ్లాడు. ఇదంతా పక్కనే ఉన్న ఓ అపార్ట్ మెంట్ వాసులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మహారాష్ట్రలోని థానెలో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. ముందు వెళుతున్న కారును ఢీ కొట్టాడు. అప్పటికీ కోపం చల్లారలేదేమో ముందుకు వెళ్లి తిరిగి వచ్చి మరోసారి వేగంగా ఢీ కొట్టాడు. చుట్టుపక్కల జనం అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారి పైకి కారుతో దూసుకెళ్లాడు. ఇదంతా పక్కనే ఉన్న ఓ అపార్ట్ మెంట్ వాసులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వైట్ ఫార్చునర్ కారును తొలుత బ్లాక్ కలర్ టాటా హారియర్ కార్ డ్రైవర్ వెనక నుంచి ఢీ కొన్నాడు. ఈ యాక్సిడెంట్ తో ఫార్చునర్ నడుపుతున్న వ్యక్తి కారు ఆపి కిందకు దిగాడు. యాక్సిడెంట్ పై రెండు కార్ల డ్రైవర్ల మధ్య మాటామాటా పెరిగింది. చుట్టుపక్కల జనం, వాహనదారులు కూడా అక్కడ గుమికూడారు. దీంతో కోపం పట్టలేక హారియర్ నడుపుతున్న వ్యక్తి తన కారును ముందుకు తీసుకెళ్లాడు. పరారవుతున్నాడని భావించిన ఓ వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించాడు. కారుకు అడ్డంగా నిల్చున్నా ఆపకుండా ఆ యువకుడిని ఢీ కొట్టి, ముందుకు ఈడ్చుకెళ్లాడు. ఆపై కారును రివర్స్ చేసి వేగంగా తీసుకెళ్లి ఫార్చునర్ ను ఢీ కొట్టాడు. ఎదురుగా వేగంగా దూసుకొస్తున్న కారును చూసి ఫార్చునర్ లో కూర్చున్న బాలుడు కేకలు పెట్టాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న జనం ఆగ్రహించి హారియర్ కారును ధ్వంసం చేశారు. కాగా, ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.