బయటపడ్డ 5000 ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. అందులోని వస్తువు చూసి షాక్ !!
పురావస్తు తవ్వకాల్లో జరుగుతున్న ప్రతీసారి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ పలు నిధి నిక్షేపాలు బయటపడుతుంటాయి. వాటిని పరిశీలించిగా చూడగా ఏళ్ల నాటి చరిత్రలు వెలుగులోకి వస్తుంటాయి.
పురావస్తు తవ్వకాల్లో జరుగుతున్న ప్రతీసారి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ పలు నిధి నిక్షేపాలు బయటపడుతుంటాయి. వాటిని పరిశీలించిగా చూడగా ఏళ్ల నాటి చరిత్రలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ అరుదైన ఘటన దక్షిణ ఇరాక్‌లో చోటు చేసుకుంది. తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తల బృందానికి వింత అనుభవమే ఎదురైంది. దాదాపు 5000 సంవత్సరాల నాటి రెస్టారెంట్ అవశేషాలు బయటపడ్డాయి. సుమేరియన్ నాగరికతకు ముఖ్యమైన కేంద్రంగా పిలిచే పురాతన లగాష్ శిధిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. ఇటీవల అక్కడ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్‌ను కనుగొన్నారు. అందులో ఆ కాలం నాటి ఓవెన్, కొన్ని బెంచీలు, గిన్నెలు, ఇతర పాత్రలలో బయటపడ్డాయి. అన్నింటికంటే విచిత్రంగా ‘జీర్’ అనే పిలిచే మట్టి రిఫ్రిజిరేటర్ బయట పడటం శాస్త్రవేత్తలును ఆశ్చరపరిచింది. ఆ ఫ్రిజ్‌లో బీర్‌ను దాచినట్టు వారికి రుజువులు కూడా దొరికాయి. అంతేకాకుండా ఆ పురాతన బీర్ తయారు చేసే ఒక రెసిపీని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నట్టు చెప్పారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయ బృందాల సంయుక్త ప్రయత్నాల ఫలితంగా ఈ ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారికి ఆస్పత్రే మండపం.. మంచమే పెళ్లి పీట.. ఆస్పత్రి బెడ్‌పైనే !!
లో బడ్జెట్ సినిమా షూటింగ్ అంటే ఇదే !! సోషల్ మీడియాలో వీడియో వైరల్
సౌదీ అరేబియాలో మరో అద్భుత కట్టడం.. మెస్మరైజ్ చేస్తున్న డిజైన్ !!
వాషింగ్ మెషీన్ లోని సబ్బునీళ్లలో 15 ని.లపాటు తిరిగిన యేడాదిన్నర చిన్నారి !! చివరికి ??
దెబ్బకు దిగివచ్చిన HCA !! ఎన్టీఆర్ ఫ్యాన్సా.. మజాకా..