1200 ఏళ్లనాటి సమాధిలో బంగారం నిధి..

|

Mar 14, 2024 | 12:21 PM

1200 ఏళ్లనాటి సమాధిలో బంగారు నిధి బయటపడటంతో శాస్త్రవేత్తలు షాకయ్యారు. అంతేకాదు బంగారంతో పాటు ఇంకా చాలా విలువైన వస్తువులు ఆ సమాధిలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మధ్య అమెరికా దేశమైన పనామాలో ఈ సమాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పనామాకు 100 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్ పార్కులో 1200 ఏళ్లనాటి ఈ పురాతన సమాధిని గుర్తించారు.

1200 ఏళ్లనాటి సమాధిలో బంగారు నిధి బయటపడటంతో శాస్త్రవేత్తలు షాకయ్యారు. అంతేకాదు బంగారంతో పాటు ఇంకా చాలా విలువైన వస్తువులు ఆ సమాధిలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మధ్య అమెరికా దేశమైన పనామాలో ఈ సమాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పనామాకు 100 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్ పార్కులో 1200 ఏళ్లనాటి ఈ పురాతన సమాధిని గుర్తించారు. సమాధిలో చాలా వరకూ శవాల అవశేషాలు బయటపడ్డాయి. వాటితోపాటు పెద్ద ఎత్తున బంగారు నిధి బయటపడింది. అలాగే, బంగారంతో తయారుచేసిన దుస్తులు, బ్రాస్‌లెట్లు, చెవిపోగులు, గంటలు, బెల్టులు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు, నగలు, సిరామిక్ వస్తువులు వంటివి గుట్టలుగా ఉన్నాయి. కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిగా దీనిని గుర్తించారు. చనిపోయిన వ్యక్తితోపాటు ఆయనకు తోడుగా ఉండేందుకు బలిదానం చేసిన 32 శవాల అవశేషాలను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Poonam Kaur: గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్‌..

‘ఫ్రెండ్స్‌తో గడపాలని నా భర్త ఒత్తిడి చేశాడు’ స్టార్ హీరోయిన్ ఆవేదన

HanuMan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హనుమాన్ టీం..

Thalapathy Vijay: దళపతి కోటి రూపాయల విరాళం.. విశాల్ ఎమోషనల్

Premalu: ‘ప్రేమలు’ చూసి మహేష్ ఫిదా.. నవ్వలేక చచ్చాడట!