విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
ఆంధ్రప్రదేశ్ అమరావతి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు, తన ప్రాణాలను పణంగా పెట్టి 18 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి వీరోచిత త్యాగం చేశాడు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న బస్సులో గుండెపోటుతో బాధపడుతున్నప్పటికీ, చివరి క్షణం వరకు బస్సును సురక్షితంగా రోడ్డుపక్కకు ఆపి ప్రయాణికులను రక్షించాడు. తన విధి పట్ల అంకితభావం, ప్రయాణికుల భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యత అందరినీ కదిలించాయి. ఆయన మరణం యావత్ రాష్ట్రాన్ని విషాదంలో నింపింది.
ప్రయాణికులే దేవుళ్లు అన్న భావనతో విధి నిర్వహణ చేసిన ఓ ఆర్టీసీ డ్రైవర్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని అమరావతి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు, తన ప్రాణాల కంటే ప్రయాణికుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అందరి హృదయాలను కదిలించాడు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ మియాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బయలుదేరిన కొద్దిసేపటి నుంచే నాగరాజుకు ఛాతిలో నొప్పి మొదలైంది. చౌటుప్పల్ సమీపానికి చేరుకునే సరికి ఛాతి నొప్పి తీవ్రత పెరిగింది. గుండెపోటు లక్షణాలు ఉన్నప్పటికీ, చివరి నిమిషం వరకు అప్రమత్తంగా బస్సును సురక్షితంగా రోడ్డుపక్కకు ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. బస్సును పక్కకు ఆపిన వెంటనే నాగరాజు ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆటో డ్రైవర్ అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నాగరాజు మృతి చెందినట్టు నిర్ధారించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన నాగరాజు మరణం అందరినీ కలచివేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: సందీప్ ఓకే.. మరి ఆ స్టార్ డైరెక్టర్ల మాటేంటి బన్నీ
Anil Ravipudi: మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు
Bhagavanth Kesari Sequel: భగవంత్ కేసరికి సీక్వెల్.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
Akira Nandan: అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్
