AP Govt School: ఈ ప్రభుత్వ స్కూల్‌లో సీటు దొరకాలంటే అదృష్టముండాలి.. కార్పొరేట్‌ను తలదన్నేలా ఎడ్యుకేషన్..

|

Jun 15, 2022 | 1:08 PM

మార్కులు రావాలన్నా, ర్యాంకులు సాధించాలన్నా కార్పొరేట్‌ విద్యా సంస్థలకే సాధ్యం. చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు. అప్పు చేసిన మరీ ప్రైవేటు పాఠశాలల్లో చిన్నారులను చేర్పిస్తుంటారు.


మార్కులు రావాలన్నా, ర్యాంకులు సాధించాలన్నా కార్పొరేట్‌ విద్యా సంస్థలకే సాధ్యం. చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు. అప్పు చేసిన మరీ ప్రైవేటు పాఠశాలల్లో చిన్నారులను చేర్పిస్తుంటారు. అందుకే ప్రైవేటు పాఠశాలల్లో సీటు దొరకడం చాలా కష్టంగా మారుతుంది. రికమెండేషన్లు ఉన్నా లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకడానికి పేరెంట్స్‌ నానా కష్టాలు పడుతున్నారు. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడ ఉంది.? నెల్లూరు జిల్లాలోని కె.ఎన్‌.ఆర్‌ నగరపాలక సంస్థ పాఠశాల కార్పొరేట్‌ విద్యాసంస్థలకు సవాల్‌ విసురుతోంది. గత 20 ఏళ్లుగా అత్యుత్తమ ఫలితాలతో ఈ పాఠశాల దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లోనూ ఈ పాఠశాల విద్యార్థులు దుమ్మురేపారు. కె.ఎన్‌.ఆర్‌ పాఠశాలకు చెందిన తర్షశ్రీ పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 590 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. అంతేకాకుండా 35 మంది విద్యార్థులు 550 కంటే ఎక్కువ మార్కులు సాధించడం విశేషం. తాజాగా కె.ఎన్‌.ఆర్‌ పాఠశాలలో 7 నుంచి 10వ తరగతి వరకు సీట్లు లేవని, కేవలం 6వ తరగతిలో మాత్రమే సీట్లు ఉన్నాయని పాఠశాల యాజమాన్యం ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటేనే ఈ పాఠశాలలో సీటుకు ఎంత క్రేజో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 15, 2022 09:43 AM