నడి సముద్రంలో ఓ వ్యక్తికి గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగింది
ఇప్పటి వరకూ మనం అత్యవసర పరిస్థితుల్లో అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తరలించడం చూశాం. కానీ తొలిసారి ఒక హార్ట్ పేషంట్‌ను పోలీస్ గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి స్టిర్లింగ్ నర్మదా ఆఫ్ స్టోర్ రిగ్గులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను శనివారం ఉదయం మయో కార్డియో ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడు. దాంతో అతన్ని అర్జంటుగా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.
ఇప్పటి వరకూ మనం అత్యవసర పరిస్థితుల్లో అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తరలించడం చూశాం. కానీ తొలిసారి ఒక హార్ట్ పేషంట్‌ను పోలీస్ గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి స్టిర్లింగ్ నర్మదా ఆఫ్ స్టోర్ రిగ్గులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను శనివారం ఉదయం మయో కార్డియో ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడు. దాంతో అతన్ని అర్జంటుగా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. కాకినాడ సముద్ర తీరానికి 25 మైళ్ల నాటికల దూరంలో ఉన్న స్టిర్లింగ్ రిగ్గులోనుంచి బాధితుడ్ని హెలికాఫ్టర్ ద్వారా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. అక్కడినుంచి రాజమండ్రి ఎస్పీ ఆదేశంతో సుమారు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను గ్రీన్ ఛానల్ పద్ధతిలో మళ్లించి కొన్ని క్షణాల్లోనే బూరుగుపూడి గేట్ నుండి రాజానగరం హైవే మీదుగా అత్యవసరంగా పేషెంట్‌ను రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇలా గ్రీన్ ఛానల్ పద్ధతిలో హార్ట్ పేషెంటును తరలించడం ఇదమే మొదటిసారి. సకాలంలో ఆస్పత్రికి చేరుకున్న ప్రతాప్ సింగ్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఓ అత్యవసర పరిస్థితిలో వ్యక్తిపట్ల పోలీసులు స్పందించిన తీరుకు నెటిజన్లను ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ తవ్వేకొద్దీ బయటపడుతున్న విగ్రహాలు
సముద్రం ఎందుకు.. నీలి రంగులోకి మారింది ??
మొన్న విశాఖ.. ఇవాళ హైదరాబాద్.. డ్రగ్స్‌కు అడ్డాగా మారిన తెలుగు రాష్ట్రాలు
అటెన్షన్ ప్లీజ్ !! రైలు ఎక్కే ముందు ఈ ఒక్క పని చేయండి
చెరువులో నీళ్లు ఎండిపోయి అల్లాడిన చేపలు.. పండగచేసుకున్న స్థానికులు