కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద విల్లాలు.. ఎలాగంటే ??
యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు ప్రచారం చేసి కోట్లలో అక్రమంగా సంపాదించాడు. లంబోర్గిని వంటి లగ్జరీ కార్లు, దుబాయ్‌లో ఆస్తులు కొనుగోలు చేయగా, ఈడీ రెయిడ్‌లో బయటపడింది. 'స్కై ఎక్స్ఛేంజ్' ద్వారా మనీ లాండరింగ్ చేసి హవాలా మార్గంలో డబ్బు పొందినట్లు గుర్తించారు. నిషేధిత కార్యకలాపాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌ల ద్వారా భారీగా సంపాదించాడు. ఈ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ లంబోర్గిని, బీఎండబ్ల్యూ, బెంజ్ వంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అనురాగ్ ద్వివేది తన యూట్యూబ్ ఛానెల్‌లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రచారం చేశాడు. దీనివల్ల చాలా మంది ఆ యాప్‌లో చేరి.. అక్రమ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించారని ఈడీ తెలిపింది. ద్వివేది సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం ‘Sky Exchange’ గ్యాంబ్లింగ్ యాప్ ద్వారా వచ్చినట్లు సమాచారం. భారత్ లో ఆన్‌లైన్ బెట్టింగ్ పై నిషేధం ఉన్నప్పటికీ యాప్ ద్వారా వచ్చిన డబ్బును అక్రమంగా మార్చి, లగ్జరీ కార్లు, ఆస్తులు కొనుగోలు చేయడానికి ద్వివేది వాడినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను దాచిపెట్టి, చట్టబద్ధమైనవిగా చూపించే ప్రయత్నం చేశాడని ఈడీ చెబుతోంది. ఈ ఆస్తులను గుర్తించడానికే ED అధికారులు ఉన్నావా లోని అతడి ఇంటిపై రెయిడ్ చేసారు. ప్రమోషన్ వీడియోలను రెడీ చేసి వాటిని సర్క్యులేట్ చేశాడు. ‘హవాలా’ ఆపరేటర్లు, ‘మ్యూల్’ ఖాతాలు, మధ్యవర్తుల ద్వారా క్యాష్ రూపంలో అక్రమ చెల్లింపులు అందుకున్నాడు. అతడి కంపెనీలు, కుటుంబ సభ్యుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు చేరిందని దీనికి సరైన ఆధారాలు లేవని అధికారులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దుబాయ్‌లో కూడా ఆస్తులు కొనుగోలు చేసాడు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరున్నారు? ఎంత అక్రమంగా సంపాదించారు? ఎక్కడ పెట్టుబడి పెట్టారు? అనే విషయాలను ED దర్యాప్తు చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బోండీ బీచ్ హీరోకి విరాళాల వెల్లువ.. రూ.14 కోట్లు పై మాటే
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్.. సరిగా ఉపయోగించుకుంటే అన్ని బానే ఉంటాయి
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు.. హడలెత్తిన జనం ఏ చేశారంటే
గోవాలో సమీరా రెడ్డి అరటి పండ్లు.. అసలు కథ ఇదే అంటున్న ముద్దుగుమ్మ