రంగు మారిన సముద్రం.. భయాందోళనలో ప్రజలు

Updated on: Sep 10, 2025 | 6:35 PM

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని సముద్రానికి ఓ ప్రత్యేకత ఉంది. గోదావరి నది నుంచి పాయగా విడివడి వశిష్టా నదిగా వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ సంగమ ప్రదేశం అంతర్వేది సముద్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రాంతంలోనే లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. దీంతో ఈ ప్రాంతం అంతర్వేది పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది.

ఎందరో భక్తులు నది-కడలి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. నిత్యం పర్యాటకులు, స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులతో కళకళలాడే అంతర్వేది సముద్రతీరం ఇప్పుడు వెలవెలబోతోంది. సముద్రంలో నీరు కలుషితమైపోవడంతో సాగరంలో స్నానం చేయాలంటేనే భయపడుతున్నారు. ఎంతో ఆశతో వచ్చిన భక్తులు స్నానం చేయకుండానే వెనుదిరుగుతున్నారు. స్వచ్ఛమైన నీటితో ఉండే సముద్రం ఇప్పుడు రంగుమారిపోయింది. చెడు వ్యర్ధాలతో బీచ్‌ అపరిశుభ్రంగా మారిపోయింది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కొట్టుకొచ్చిన వ్యర్ధాలు నదుల్లో చేరి.. సముద్రంలో కలవడంతో స్వచ్ఛంగా ఉండే సముద్రపు నీరు బురదనీరుగా మారిపోతోందని స్థానికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు శుభ్రం చేసినా పదేపదే వ్యర్ధాలు కొట్టుకొస్తున్నాయని అంటున్నారు. ఈ విషయమై కలెక్టర్‌ స్పందించి బీచ్‌ని శుభ్రం చేయించాలని కోరుతున్నారు స్థానిక సర్పంచ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

పేలిపోయిన ఏసీ.. ముగ్గురు మృతి

Apple Event: యాపిల్ కావాలా నాయనా

భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

ఎయిర్‌పోర్ట్‌ అధికారుల చేతివాటం బ్యాటరీలు, నూనె దొంగిలించి..