అవి విష పురుగులు కాదు.. జెల్లీఫిష్‌లు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఇటీవల కొందరు చిన్నారులు బీచ్‌లో ఆడుకుంటూ సముద్రంలో స్నానం చేయగా వారికి కొన్ని సముద్ర జీవులు తాకడం వల్ల శరీరంపై దురద, మంట దద్దుర్లు రావడంతో అంతా ఆందోళన చెందారు. అవి విషపురుగులని ప్రచారం జరిగింది. దాంతో సముద్రంలో స్నానం చేయడానికి సందర్శకులు వెనుకాడారు.
అయితే అవి విషపురుగులు కావని, జెల్లీ ఫిష్ వర్గానికి చెందిన జీవులని, వాటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని స్థానిక మత్స్యశాఖ ఏడీ సిద్ధార్థవర్దన్ తెలిపారు. ఏడీ సిద్ధార్థవర్దన్ తెలిపిన వివరాలు ప్రకారం… జెల్లీఫిష్ వర్గానికి చెందిన ఈ జీవులు సాధారణంగా సముద్రం, నదుల్లో వర్షాకాలం, శీతాకాలంలో గుంపులు గుంపులుగా ఇవి సంచరిస్తుంటాయని తెలిపారు. ఇవి తెలుపు, గోధుమ, నీలం రంగుల్లో ఉంటాయని, కొన్ని తెల్లగా ఉండి పైన డిప్పపై మచ్చలు ఉంటాయి. వీటిల్లో నీలం రంగులో ఉండేవాటిని బ్లూడ్రాగన్, బ్లూబటన్ జెల్లీఫిష్‌లు అంటారు. స్థానికులు మాత్రం వీటిని అగ్గిబాటాలుగా పిలుస్తారు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. మనిషికి తగిలితే కొద్దిపాటి దురద, మంట వస్తుంది. కానీ, వెంటనే శుభ్రమైన ఉప్పు, వేడినీటితో కడిగితే తగ్గిపోతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇటీవల సందర్శకులు పిల్లలతో కలిసి అంతర్వేది బీచ్‌లో స్నానాలు చేస్తూ ఇసుకపై ఆటలు ఆడుతుండగా జెల్లీఫిష్ వర్గానికి చెందిన జీవులు శరీరానికి తాకడంతో మంట, దురద రావడంతో వారు ఆందోళన చెందారు. వెంటనే గ్రామానికి సమీపంలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. దురద వచ్చిన చోట శుభ్రం చేసి, వాటివల్ల ఏవిధమైన ప్రమాదం ఉండదని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. గోధుమ రంగు జెల్లీ ఫిష్‌లలో ఉన్న ఆరు కాళ్లను ఉప్పునీటిలో ఊరబెట్టి గట్టిపడిన తరువాత కొంతమంది మత్స్యకారులు వాటిని వండుకుని తింటారట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లి ప్రేమను చాటుకున్న గొరిల్లా..ఏం చేసిందో చూడండి
ఎరుపు రంగులో ఉండే ఆహారాలను.. రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?