ట్రంప్‌ మరో కీలక నిర్ణయం.. వైట్‌ హౌస్‌లో ఫెయిత్‌ హౌస్‌..!

Updated on: Feb 14, 2025 | 8:45 PM

అమెరికా కరెన్సీలో అతి తక్కువ విలువున్న పెన్నీలను కొత్తగా తయారుచేయడాన్ని నిలిపేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. ఒక నాణెం మింటింగ్‌కు రెండు పెన్నీల ఖర్చు అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఓ వృథా ఖర్చుగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌సోషల్‌లో పోస్టు చేశారు. ‘‘చాలాకాలంగా అమెరికా పెన్నీలను తయారుచేస్తోంది. ఒక్కో పెన్నీ ముద్రణకు రెండు సెంట్స్‌ ఖర్చు అవుతోంది. ఇది చాలా వృథా. అందుకే పెన్నీల తయారీ నిలిపేయాలని ట్రెజరీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశా. మన గ్రేటెస్ట్‌ దేశ బడ్జెట్‌ నుంచి వృథాను తొలగించండి. అది పెన్నీ అయినా సరే’’ అంటూ ఆ పోస్టులో వెల్లడించారు.

న్యూఆర్లిన్స్‌లో సూపర్‌ బౌల్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను ఆయన స్వయంగా వెళ్లి వీక్షించారు. ఈ ప్రయాణం సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ ఇప్పటికే ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో పలు లోపాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ వీటిని గమనించలేదని.. లేకపోతే అమెరికాపై ఇప్పటికంటే తక్కువ భారం ఉండేదని వెల్లడించారు. ఇటీవల డోజ్‌కు ట్రెజరీలోని సమాచారం చూసేందుకు అనుమతులు లభించాయి. ట్రంప్‌ 2.0లో భాగంగా ప్రభుత్వ ఖర్చులకు కళ్లెం వేయడంపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు ఏజెన్సీల్లో వృథా వ్యయాలపై దృష్టి సారించింది డోజ్. భారీగా ఉద్యోగులను కూడా తగ్గించే అంశంపై దృష్టిపెట్టింది.

మరిన్ని వీడియోల కోసం :

స్పీడ్ బోటులో షికారు చేస్తున్న పర్యాటకులు..నది మధ్యలోకి వెళ్లగానే..

భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే ఊహించని షాక్ వీడియో

అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో

ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు…

భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. వీడియో